News November 17, 2025
నేడు నంద్యాలలో ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ: కలెక్టర్

జిల్లాలోని కలెక్టరేట్‌తో పాటు మండలం, డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు నంద్యాల కలెక్టర్ రాజకుమారి ఆదివారం తెలిపారు. ప్రజలు తమ అర్జీలను ప్రత్యక్షంగా ఇవ్వవచ్చన్నారు. లేదా ఆన్లైన్‌లో meekosam.ap.gov.in ద్వారా సమర్పించవచ్చని సూచించారు. అర్జీల పరిష్కార స్థితి తెలుసుకోవడానికి టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించాలని సూచించారు.
Similar News
News January 20, 2026
వెండి భగభగలు.. కారణమిదే!

వెండి ధరలు ఆకాశాన్ని తాకడానికి చైనా నిర్ణయాలే ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ వెండి సరఫరాలో ఆధిపత్యం ఉన్న చైనా తన క్లీన్ ఎనర్జీ (సోలార్, EV) అవసరాల కోసం ఎగుమతులపై ఆంక్షలు విధించింది. దీనికి తోడు అంతర్జాతీయ ఉద్రిక్తతలు, డాలర్ విలువ తగ్గడం, పారిశ్రామిక డిమాండ్ పెరగడంతో ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం KG వెండి ధర ₹3.40లక్షలు ఉండగా త్వరలోనే రూ.4లక్షలు క్రాస్ చేస్తుందని అంచనా.
News January 20, 2026
రియల్ ఎస్టేట్ జాతకాన్ని మార్చేయబోతున్న గోదావరి!

‘ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడ సిరి ఉంటుంది’ అనే సామెత ముత్తంగి, ఘన్‌పూర్ బెల్ట్‌లో నిజం కాబోతోంది. రూ.2,400 కోట్లతో ప్యాకేజీ-2 పనులు మొదలవ్వగానే ఆ ఏరియా అంతా ఇన్వెస్ట్‌మెంట్లకు అడ్డాగా మారనుంది. IT కారిడార్‌కు ఆనుకుని ఉన్న ఈ ప్రాంతాల్లో నీటి భద్రత లభించడంతో భూముల ధరలకు రెక్కలు రావడం ఖాయం. మల్లన్న సాగర్ నుంచి వచ్చే గోదావరి జలాలు వెస్ట్ HYDను మరో స్థాయికి తీసుకెళ్లే ‘ఎకనామిక్ బూస్టర్’.
News January 20, 2026
భూపాలపల్లి: దివ్యాంగులకు ఉచిత సహాయక పరికరాల పంపిణీకి దరఖాస్తులు

తెలంగాణ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను దివ్యాంగులు, బాధితులకి మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిల్స్, హైబ్రిడ్ వీల్ ఛైర్, వినికిడి పరికరాలు, ట్యాబ్‌లు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అర్హులైన దివ్యాంగులు https://tgobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా జనవరి 30, 2026లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.


