News August 17, 2024
నేడు పాఠశాలల్లో పీటీఎం సమావేశాలు.. అంతా సిద్ధం
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,998 పాఠశాలల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం (పీటీఎం) శనివారం నిర్వహించేందుకు ప్రధాన ఉపాధ్యాయులు ఏర్పాట్లు చేశారు. రెండు రోజుల ముందే విద్యార్థుల ద్వారా వారి తల్లిదండ్రులకు ఆహ్వాన పత్రాలు అందజేశారు. MBNR-791, NGKL-808, GDWL-448, WNPT-495, NRPT-456 మంది ఏఏపీసీలు ఉన్నారు. తల్లిదండ్రుల ప్రశ్నలు, ఉపాధ్యాయుల సమాధానాలు, ఆలోచనలను పంచుకుంటారు.
Similar News
News September 10, 2024
NRPT: ఉత్తమ గ్రామ పంచాయతీల ఎంపికకు నివేదికలు పంపండి
జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీల ఎంపికకు నివేదికలు పంపించాలని కలెక్టర్ సిక్త పట్నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం నారాయణపేట కలెక్టరేట్లో డిఆర్డిఏ అధికారులతో సమావేశం నిర్వహించారు. 9 అంశాల్లో నివేదికలు మంగళవారం సాయంత్రంలోగా పంపించాలని చెప్పారు. వాటిని పరిశీలించి జాతీయ పురస్కారాల కొరకు ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుందని సూచించారు. సంబంధిత అధికారులు పాలోన్నారు.
News September 9, 2024
ప్రజలకు విజ్ఞలు తొలగి విజయం కలగాలి: డిఐజి చౌహన్
మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు మొదలుపెట్టిన పనులలో ఎలాంటి విఘ్నాలు లేకుండా.. అన్నింటా విజయం సాధించాలని జోగులాంబ జోన్ -7 డిఐజి ఎల్ఎస్ చౌహాన్ అన్నారు. ఆయన స్థానిక జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలీసు సురక్షా వినాయక విగ్రహంకు జిల్లా ఎస్పీ జానకి, అదనపు ఎస్పీ రాములు లతో గణనాథునికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
News September 9, 2024
రాష్ట్రంలో 80వేల ఎకరాల వక్ఫ్ భూములు: డీకే అరుణ
తెలంగాణ రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు పరిధిలో సుమారు 80వేల ఎకరాల భూములు ఉన్నాయని ఎంపీ డీకే అరుణ అన్నారు. మహబూబ్ నగర్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నిరుపేదలకు లబ్ధి చేకూర్చేందుకే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డులో సవరణలు చేపట్టిందన్నారు. ఈ విషయంలో కొందరు పనిగట్టుకొని కేంద్రంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అభిప్రాయాలు తెలుసుకునేందుకు రాష్ట్రంలో నెలాఖరున జేపీసీ పర్యటన ఉంటుందన్నారు.