News November 19, 2025
నేడు పుట్టపర్తికి ప్రధాని.. షెడ్యూల్ ఇదే..!

శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఇవాళ ప్రధాని మోదీ పుట్టపర్తికి రానున్నారు. ఉదయం 10 గంటలకు ప్రశాంతి నిలయం చేరుకుని, బాబా మహా సమాధిని సందర్శిస్తారు. 10:30 గంటలకు జరిగే శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా సత్యసాయి బాబా గౌరవార్థం ఒక స్మారక నాణెం, ప్రత్యేక స్టాంపులను విడుదల చేసి, సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడి నుంచి తమిళనాడులోని కోయంబత్తూరుకు బయలుదేరి వెళతారు.
Similar News
News January 23, 2026
పాడేరు: మీకోసం కార్యక్రమానికి 102 ఫిర్యాదులు

పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 102 ఫిర్యాదులు అందాయి. జిల్లా ఇన్‌ఛార్జి జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. రహదారి, తాగునీటి సమస్యలపై అధికంగా ఫిర్యాదులు అందాయన్నారు. మీ కోసంలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆమె ఆదేశించారు.
News January 23, 2026
చిత్తూరు: రేపే చివరి అవకాశం

దళిత మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం అజయ్ పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు చిత్తూరు DRDA పీడీ శ్రీదేవి ఓ ప్రకటనలో కోరారు. అర్హులైన ఎస్సీ మహిళలు శనివారం లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. దరఖాస్తులను మండల మహిళా సమాఖ్యలో సమర్పించాలన్నారు. ఈ పథకంలో జిల్లాకు 205 యూనిట్లు కేటాయించారన్నారు.
News January 23, 2026
చెన్నూర్: 100 పడకల ఆసుపత్రి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

చెన్నూర్‌లో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం పరిశీలించారు. పనుల పురోగతిని పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రి నిర్మాణం త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


