News November 19, 2025

నేడు పుట్టపర్తికి ప్రధాని.. షెడ్యూల్ ఇదే..!

image

శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఇవాళ ప్రధాని మోదీ పుట్టపర్తికి రానున్నారు. ఉదయం 10 గంటలకు ప్రశాంతి నిలయం చేరుకుని, బాబా మహా సమాధిని సందర్శిస్తారు. 10:30 గంటలకు జరిగే శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా సత్యసాయి బాబా గౌరవార్థం ఒక స్మారక నాణెం, ప్రత్యేక స్టాంపులను విడుదల చేసి, సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడి నుంచి తమిళనాడులోని కోయంబత్తూరుకు బయలుదేరి వెళతారు.

Similar News

News January 22, 2026

రహదారులు రక్తం సిక్తం కాకూడదు: SP

image

రహదారులు రక్తశిక్తం కాకూడంటే నిబంధనలు పాటించాలని SP ధీరజ్ కునుబిల్లి తెలిపారు. గురువారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడారు. కొత్త రోడ్లనే మోజు, కొద్ది దూరం ఆదా అవుతుందన్న ఆత్రుతతో రహదారి నిబంధనలను తుంగలో తొక్కితే ఆ దారి నేరుగా మృత్యువు చెంతకే చేరుస్తుందన్నారు. జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాలను విశ్లేషించగా నిబంధనలు పాటించకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.

News January 22, 2026

ఏడాదిలో 5సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సు రద్దు

image

పదేపదే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిని కట్టడి చేసేందుకు కేంద్ర రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ రూల్స్‌ను కఠినం చేసింది. ఏడాదిలో 5సార్లు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే డ్రైవర్ల లైసెన్సును రద్దు లేదా 3 నెలల పాటు సస్పెండ్ చేయనుంది. గతంలో సీరియస్ ఉల్లంఘనల్లో ఇది ఉండేది. కానీ ఇపుడు హెల్మెట్, సీట్ బెల్ట్, రెడ్ లైట్ జంపింగ్ వంటి అంశాలకూ వర్తించనుంది. JAN 1 నుంచే అమల్లోకి తెస్తూ కేంద్రం చట్టాన్ని సవరించింది.

News January 22, 2026

NLG: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

కేతెపల్లి మండలంలోని కొర్లపాడు సమీపంలోని 65వ నంబరు జాతీయ రహదారిపై విజయవాడ వైపు వెళ్తున్న ఓ గుర్తు తెలియని వాహనం పాదచారిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సదరు వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. చిత్రంలోని వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే కేతపల్లి ఎస్సై (ఫోన్‌: 8712670180)కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.