News November 19, 2025
నేడు పుట్టపర్తికి మోదీ రాక

AP: సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ పుట్టపర్తికి రానున్నారు. బాబా మందిరాన్ని, మహాసమాధిని ఆయన సందర్శించనున్నారు. ఈ సందర్భంగా బాబా స్మారక నాణెం, స్టాంపులను విడుదల చేయనున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో పుట్టపర్తిలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు సహా ఎంతో మంది సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు.
Similar News
News January 22, 2026
జగిత్యాల: తెలంగాణను దేశానికే దిక్సూచిగా మారుస్తాం: డిప్యూటీ సీఎం

ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పిస్తూ, రాష్ట్రాన్ని దేశానికే దిక్సూచిలా తీర్చిదిద్దడమే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లతో కలిసి ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన.. సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
News January 22, 2026
ఖమ్మం: సోషల్ మీడియాపై పోలీసుల నజర్.. జర జాగ్రత్త..!

సోషల్ మీడియాపై పోలీసులు నిఘా పెట్టారు. ఎవరైనా సరే అనుచిత, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, సీఎం రేవంత్ రెడ్డిపై సోషల్ మీడియాలో అనుచిత, అసభ్య వ్యాఖ్యలు చేసిన రంగా ప్రవీణ్‌ను ఖమ్మం త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా పోస్టులు చేయొద్దని ఉమ్మడి ఖమ్మం పోలీసులు సూచిస్తున్నారు.