News December 16, 2024

నేడు పోలవరంలో సీఎం పర్యటన.. షెడ్యూల్ ఇదే

image

ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు పోలవరం ప్రాజెక్ట్ సందర్శనలో భాగంగా ఉదయం 10.45 గం.లకు ప్రాజెక్ట్ వ్యూపాయింట్ వద్ద నున్న హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 11.05 గం.లకు ప్రాజెక్ట్ సైట్‌కు చేరుకుంటారు. 12.05 గం.లకు వరకు ప్రాజెక్ట్ ప్రాంతంలోని గ్యాప్-1, గ్యాప్-2 వైబ్రో కాంపాక్షన్ పనులను, డీవాల్ నిర్మాణ పనులను పరిశీలిస్తారు. 12.20 గం.లకు పనులపై అధికారులు, నిర్మాణదారులతో సమీక్షిస్తారు.

Similar News

News January 26, 2025

ప.గో: జిల్లాకు హీరో వెంకటేశ్, మీనాక్షి చౌదరి

image

సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ మీట్ ఆదివారం భీమవరంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్థానిక ఎస్ఆర్‌కే ఇంజినీరింగ్ కళాశాలలో ఈవెంట్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మీట్‌కి హీరో వెంకటేశ్, హీరోయిన్లు, బుల్లిరాజు, మరికొంత మంది నటులు సందడి చేయనున్నారు. ఈ సినిమా రిలీజైన రోజే రూ.45 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిందని చిత్ర బృందం పేర్కొంది.

News January 26, 2025

భీమవరం: తుది జాబితా ఆమోదం: జేసీ

image

పశ్చిమ గోదావరి జిల్లాలోని భూముల మార్కెట్ విలువ పెంపునకు సమర్పించిన ప్రతిపాదనల తుది జాబితాను ఆమోదించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి శనివారం తెలిపారు. ఈ సందర్భంగా భీమవరం కలెక్టరేట్‌లో జేసీ జిల్లాలోని 15 సబ్ రిజిస్ట్రార్స్ పరిధిలోని అధికారులతో సమావేశమై జిల్లాలోని భూముల విలువల పెంపుదలకు ప్రతిపాదనలను సమీక్షించి తుది ప్రతిపాదలను సమీక్షించి ఆమోదించారు.

News January 26, 2025

భీమవరం: గణతంత్ర వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన జెసీ 

image

భీమవరం కలెక్టరేట్ గ్రౌండ్ లో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు పరిశీలించారు. ప్రభుత్వ పథకాలు ప్రతిబింబించేలా శకటాలు, స్టాల్స్ ఏర్పాట్లు చేయడం చేస్తున్నట్లు, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రేక్షకులు వీక్షించేలా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.