News December 1, 2025

నేడు ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ: కలెక్టర్

image

నంద్యాల జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో డిసెంబర్ 1న (సోమవారం) ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీలు స్వీకరించనున్నామని కలెక్టర్ జి.రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ అర్జీలను ప్రత్యక్షంగా ఇవ్వడమే కాకుండా, ఆన్లైన్‌లో meekosam.ap.gov.in ద్వారా కూడా సమర్పించవచ్చన్నారు. కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News February 13, 2026

బంగ్లాలో BNP విజయం.. మనకెలా లాభం అంటే?

image

బంగ్లాదేశ్‌లో <<19125261>>BNP<<>> గెలవడం భారత్‌కు కొద్దిగా సానుకూల అంశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో ప్రధాన పార్టీ ‘జమాతే ఇస్లాం’ పూర్తిగా పాకిస్థాన్‌కు తొత్తు అని, అది గెలిచి ఉంటే సమస్యలు వచ్చి ఉండేవని చెబుతున్నారు. బంగ్లాలో హిందువులపై దాడి వెనుక జమాతేనే కీలక సూత్రధారి అనే ఆరోపణలు ఉన్నాయి. అటు BNP అధినేత తారిఖ్ విద్యావంతుడు కావడంతో పాటు ఏ దేశంలో జోక్యం చేసుకోమని ఇప్పటికే స్పష్టం చేశారు.

News February 13, 2026

సంగారెడ్డి: మైనర్ బాలికపై రేప్.. 20 ఏళ్ల శిక్ష

image

సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలానికి చెందిన వడ్డే రాజు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో సంగారెడ్డి స్పెషల్ పొక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నేరం నిరూపితం కావడంతో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధిస్తూ జడ్జి కె.జయంతి తీర్పు చెప్పారు. నిందితుడికి శిక్ష పడేలా సమర్థవంతంగా పనిచేసిన పోలీసు అధికారులను ఎస్పీ పారితోష్ పంకజ్ ప్రత్యేకంగా అభినందించారు.

News February 13, 2026

విశాఖలో సహజీవనం.. ప్రియుడిని చంపిన ప్రియురాలు

image

ఆనందపురం శివారు పందుల ఫారంలో జరిగిన <<19116438>>హత్య<<>> కేసులో నిందితురాలు షేక్ ముబీనా అలియాస్ శ్రావణి (41)కి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రాజమహేంద్రవరానికి చెందిన నాగశివ (36)తో ఆమె సహజీవనం సాగిస్తోంది. ఆవు అమ్మకం డబ్బుల విషయంలో గొడవ, వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో అతడిపై కత్తితో దాడి చేయగా మృతి చెందాడు. జాగిలాల సాయంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.