News December 1, 2025
నేడు ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ: కలెక్టర్

నంద్యాల జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో డిసెంబర్ 1న (సోమవారం) ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీలు స్వీకరించనున్నామని కలెక్టర్ జి.రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ అర్జీలను ప్రత్యక్షంగా ఇవ్వడమే కాకుండా, ఆన్లైన్‌లో meekosam.ap.gov.in ద్వారా కూడా సమర్పించవచ్చన్నారు. కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News February 7, 2026
APPLY NOW: C-DOTలో సైంటిస్ట్ పోస్టులు

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్(<
News February 7, 2026
కవలలకు రామ-లక్ష్మణ అనే పేర్లేందుకు పెడతారు?

రామాయణంలో లక్ష్మణ, శత్రుఘ్నులు మాత్రమే కవలలు. అయినప్పటికీ రామలక్ష్మణుల బంధమే అందరికీ ఆదర్శంగా నిలిచింది. అందుకు అనేక కారణాలున్నాయి. లక్ష్మణుడు ఎప్పుడూ రాముడి వెన్నంటే ఉన్నాడు. అవసరం లేకపోయినా అడవులకెళ్లాడు. యుద్ధం చేశాడు. ఈ అసాధారణ సోదర ప్రేమ, ఐక్యత కారణంగానే కవలలు పుట్టినప్పుడు వారు కూడా అలా కలిసి ఉండాలని రామ-లక్ష్మణ అనే పేర్లు పెడతారు. ఇది పుట్టుక కన్నా వారి మధ్య ఉన్న బంధానికి ఇచ్చే గౌరవం.
News February 7, 2026
సీఎం సభ.. అన్ని దారులు పరిగి వైపే!

వికారాబాద్ జిల్లా పరిగి మండలం నారాయణపూర్ శివారులో నేడు జరిగే సీఎం బహిరంగ సభకు సర్వం సిద్ధం అయ్యింది. ఈ సభకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, ఆమనగల్లు, VKB, పరిగి, తాండూర్, కొడంగల్, కోస్గి మొయినాబాద్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అభ్యర్థులు, నాయకులు, ప్రజలు సుమారుగా 50వేల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ సభ కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


