News December 1, 2025
నేడు బాపట్లలో PGRS రద్దు: కలెక్టర్

బాపట్ల కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ వినోద్ కుమార్ ఆదివారం తెలిపారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో PGRS రద్దు చేసినట్లు వివరించారు. విషయాన్ని అర్జీదారులు గమనించి కార్యాలయానికి రావద్దని సూచించారు. తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
Similar News
News February 16, 2026
TODAY HEADLINES

* T20WC: పాక్‌పై భారత్ ఘన విజయం
* జాబ్ క్రియేటర్లుగా డేటా సెంటర్లు: మోదీ
* CECపై అభిశంసనకు సిద్ధమైన విపక్షాలు
* ఏపీలో రేపు ఆప్షనల్ హాలిడే.. తెలంగాణలో నో
* కోవా బన్ను వివాదం.. బాధితుడికి లోకేశ్ మద్దతు
* రైతులకు రూ.20వేలు ఎక్కడ: YCP
* మున్సిపల్ ఫలితాలు నా పనికి గీటురాయి: రేవంత్
* TG: రేపే మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎన్నిక
* TG: ఒకే విడతలో రైతుభరోసా.. 17న జమ!
News February 16, 2026
క్లోరిన్ గ్యాస్ లీకేజీపై యంత్రాగం అప్రమత్తం: కలెక్టర్

బలిజిపేట మండలం అంపావల్లిలో జరిగిన క్లోరిన్ గ్యాస్ లీకేజీ ఘటనపై జిల్లా యంత్రాంగం తక్షణమే అప్రమత్తం అయిందని జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. లీకేజీ ప్రభావంతో అస్వస్తతకు గురైన ఏడుగురిని వెంటనే ఆసుపత్రిలో చేర్పించి, వైద్యాన్ని అందించారన్నారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదన్నారు.
News February 16, 2026
మంత్రులతో సీఎం రేవంత్ జూమ్ మీటింగ్

TG: కార్పొరేషన్ మేయర్లు, మున్సిపాలిటీల ఛైర్మన్ల ఎన్నికపై సీఎం రేవంత్ మంత్రులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. రేపు వీరి ఎన్నిక సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. హంగ్ ఏర్పడిన చోట ఏ ఒక్కటి చేజారనీయొద్దని నేతలకు దిశానిర్దేశం చేశారు. మీటింగ్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి తదితరులు పాల్గొన్నారు.


