News November 19, 2025
నేడు బాపట్ల జిల్లా రైతుల ఖాతాల్లో రూ.107.21కోట్లు జమ!

బాపట్ల జిల్లాలోని సుమారు 1,60,441 రైతుల అకౌంట్లలోకి అన్నదాత సుఖీభవ 2వ విడత రూ.5,000, పీఎం కిసాన్ 21వ విడత రూ.2,000 కలిపి మొత్తంగా రూ.7,000లు బుధవారం జమ కానున్నాయి. ఈ మేరకు జిల్లా ఇన్‌ఛార్జి డీఏవో కె.అన్నపూర్ణమ్మ వివరాలను మంగళవారం వెల్లడించారు. జిల్లాలోని 25 మండలాల్లోని రైతులకు రూ.107.21 కోట్ల లబ్ధి చేకూరనున్నట్లు ఆమె తెలిపారు.
Similar News
News January 15, 2026
‘జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని ఘనంగా నిర్వహించాలి’

రాష్ట్ర పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని విజయవంతం చేయాలని పి.గన్నవరం MLA గిడ్డి సత్యనారాయణ అధికారులను కోరారు. బుధవారం CI భీమరాజుతో కలిసి ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉన్నందున ఎక్కడా అశ్రద్ధ వహించవద్దని పేర్కొన్నారు.

ADB: బీజేపీ సెగ్మెంట్లపై కాంగ్రెస్ నేతల గురి!

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల కార్పొరేషన్‌తో సహా 11 మున్సిపాలిటీలు ఉన్నాయి. బీజేపీ నుంచి ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంతో పాటు ఆదిలాబాద్, నిర్మల్, కాగజ్‌నగర్, ముధోల్ నియోజకవర్గాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయతీరాలకు చేరాలంటే కష్టపడాల్సి వస్తుంది.