News August 13, 2025
నేడు భీమవరంలో మాజీ సీఎం జగన్ పర్యటన

మాజీ సీఎం వైసీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహ వేడుకలో ఆయన పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3.15 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి, విఎస్స్ గార్డెన్స్‌లో జరిగే వేడుకకు హాజరు అవుతారు. అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా జగన్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.
Similar News
News March 11, 2026
ప.గో: అసభ్య పదజాలం.. ఫొటోలతో వివాహితకు బెదిరింపులు

ఫోన్ ద్వారా వివాహితను అసభ్య పదజాలంతో దూషిస్తూ, సోషల్ మీడియాలో ఫొటోలు పెడతానంటూ బెదిరిస్తున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కథనం.. నరసాపురం టౌన్‌లోని ఓ వివాహితను ఏడాదిగా గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ ద్వారా వేదిస్తున్నారు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు నరసాపురం టౌన్ ఎస్ఐ ఎస్.ముత్యాలరావు కేసు నమోదు చేశారు. నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
News March 11, 2026
ప.గో: లైంగిక దాడి కేసులో పదేళ్లు జైలు

మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో యువకుడికి భీమవరం పోక్సో కోర్టు 10 ఏళ్లు జైలు శిక్ష విధించినట్లు పెనుగొండ ఎస్సై గంగాధరరావు తెలిపారు. 2021లో నడిపూడికి చెందిన మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన చిల్లే చరణ్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడి చేసినట్లు కేసు నమోదైంది. తర్వాత నిందితుడు గల్ఫ్ దేశానికి వెళ్లిపోయాడు. శిక్షతో పాటు బాధితురాలికి రూ.1 లక్ష నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు.
News March 11, 2026
ఏకీకృత కుటుంబాల నమోదు వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 27,865 ఏకీకృత కుటుంబాల నమోదు ప్రక్రియను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఎంపీడీవోలు, ఎంఎస్‌ఈవోలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వర్ణ గ్రామ సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సర్వేలను త్వరితగతిన ముగించాలని ఆదేశించారు.


