News November 7, 2025
నేడు వందేమాతర గేయం సామూహిక గీతాలాపన

వందేమాతర గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉదయం 10 గంటలకు ASF కలెక్టరేట్ సముదాయం ఆవరణలో సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ఒక ప్రకటనలో తెలిపారు. బంకిం చంద్ర చటర్జీ వందేమాతర గేయ రచన చేసి 150 సంవత్సరాలు పూర్తయిందని, ఈ సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు.
Similar News
News January 15, 2026
ఖమ్మం: వైద్య సేవలకు ఊతం

ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత విస్తృతం కానున్నాయి. కొత్తగా పది మంది ల్యాబ్ టెక్నీషియన్లను కేటాయించారు. నూతనంగా ఎంపికైన వీరు బుధవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.నరేందర్‌కు నివేదించారు. వీరి రాకతో ల్యాబ్ సేవలు మరింత వేగంగా అందుతాయని సూపరింటెండెంట్ హర్షం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరత తీరడమే కాకుండా, పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు సకాలంలో అందుబాటులోకి రానున్నాయి.
News January 15, 2026
నల్గొండలో ఇక నవ శకం!

నల్గొండను నగరపాలక సంస్థగా మార్చడంతో పాలనలో కొత్త శకం ప్రారంభంకానుంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు నల్లగొండ మునిసిపాలిటీగా కొనసాగగా, ఇకపై కార్పొరేషన్‌గా కొనసాగుతుంది. కార్పొరేషన్ కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యేక నిధులు మంజూరవుతాయి. నగర ప్రథమ పౌరుడిగా మేయర్ కొనసాగుతారు. రాజకీయంగా మేయర్ పదవికి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. మంత్రులతో సరిసమానమైన ప్రోటోకాల్ ఉంటుంది.
News January 15, 2026
NLG: జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రీ అంతంతే!

వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేయాలన్న సంకల్పంతో కేంద్రం చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఓ పక్క సర్వర్ మొరాయింపు.. ఇంకోపక్క వ్యవసాయ పనుల్లో రైతుల నిమగ్నం.. మరోవైపు అవగాహన లేమి.. వెరసి పంటల ఆన్లైన్ నమోదుకు అడ్డంకిగా మారాయి. జిల్లాలో 5,65,782 మంది రైతులకు గాను ఇప్పటివరకు 30,953 మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 3,34,953 మంది రైతులు రిజిస్ట్రేషన్‌కు దూరంగా ఉన్నారు.


