News November 20, 2025
నేడు వరంగల్ మార్కెట్ బంద్

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ గురువారం బంద్ ఉండనుంది. అమావాస్య సందర్భంగా మార్కెట్‌కు సెలవు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. కావున రైతులు విషయాన్ని గమనించి మార్కెట్‌కు ఉత్పత్తులు తీసుకొని రావొద్దని, ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. తిరిగి శుక్రవారం మార్కెట్ ప్రారంభం అవుతుందన్నారు.
Similar News
News January 24, 2026
MHBD: రోడ్ సేఫ్టీ అవగాహన కోసం బైక్ ర్యాలీ: SP

రోడ్డు భద్రతపై అవగాహన కోసం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం ఉదయం 6:30 గంటలకు తలపెట్టనున్న బైక్ ర్యాలీకి పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎస్పీ డాక్టర్ శబరిష్ సూచించారు.“Arrive Alive” కార్యక్రమంలో భాగంగా MHBD టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి బైక్ ర్యాలీ ప్రారంభమవుతుందాన్నారు. జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎమ్మెల్యే మురళి నాయక్ బైక్ ర్యాలీకి హాజరుకానున్నట్లు తెలిపారు.
News January 24, 2026
MHBD: డ్రగ్స్ రహిత సమాజం కోసం కృషి చేయాలి: కలెక్టర్

జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు పక్కా కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాల, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై జిల్లా స్థాయి నార్కోటిక్, నార్కోటిక్ కంట్రోల్ సమావేశంలో జిల్లాలో నమోదు అవుతున్న ఎన్‌డీపీఎస్ కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాదక ద్రవ్యాల వాడకం నివారణ కోసం శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.
News January 24, 2026
జనవరి 24: చరిత్రలో ఈరోజు

1757: బొబ్బిలి యుద్ధం ప్రారంభం
1950: జనగణమన గీతాన్ని జాతీయ గీతంగా స్వీకరించిన భారత ప్రభుత్వం
1966: భారత ప్రధానిగా ఇందిరా గాంధీ(ఫొటోలో) బాధ్యతలు స్వీకరణ
1966: అణు శాస్త్రవేత్త హోమీ జహంగీర్ బాబా మరణం
1981: సినిమా నటి కాంచనమాల మరణం
* జాతీయ బాలికా దినోత్సవం


