News February 6, 2025

నేడు విజయవాడకు మంత్రి లోకేశ్

image

విజయవాడకు గురువారం మంత్రి లోకేశ్ రానున్నారు. ఉదయం 9.30 గంటలకు సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజ్‌లో హ్యాక్‌థాన్ ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిగా మంత్రి నారా లోకేశ్ పాల్గొంటారు. వివిధ సంస్థల నుంచి 1300 మంది మేధావులు హాజరుకానున్నారు. ఏఐలో స్వర్గీయ నందమూరి తారకరామారావు మాట్లాడనున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Similar News

News January 20, 2026

రేపు మండల స్థాయి సాంఘిక శాస్త్ర ప్రతిభ పరీక్షలు

image

సంగారెడ్డి జిల్లాలోని పదో తరగతి విద్యార్థులకు బుధవారం మండల స్థాయి సాంఘిక శాస్త్ర ప్రతిభ పోటీ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు ఆయా మండల కేంద్రాల్లోని ఉన్నత పాఠశాలల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ప్రతిభ కనబరిచిన విజేతలను జిల్లా పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని డీఈఓ ఆదేశించారు.

News January 20, 2026

లక్కిరెడ్డిపల్లి గంగమ్మ జాతర ఎప్పుడంటే..?

image

లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురంలో ఫిబ్రవరి 16, 17వ తేదీల్లో గంగమ్మ జాతర జరగనుంది. దీనికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జాతర నిర్వాహకులకు మంగళవారం సూచించారు. గ్రామంలో జరిగిన గంగమ్మ పార్వేట ఉత్సవంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగమ్మ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు విశేష సంఖ్యలో హాజరవుతారని చెప్పారు.

News January 20, 2026

నిర్మల్: దివ్యాంగులు దరఖాస్తు చేసుకోండి

image

2024–25 సంవత్సరానికి నిర్మల్ జిల్లాలో దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, వీల్‌చైర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌ల మంజూరుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా శిశు, దివ్యాంగుల సంక్షేమ అధికారి తెలిపారు. ఈ నెల 30 వరకు https://tgobmms.cgg.gov.inలో వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.