News December 3, 2025

నేడు హుస్నాబాద్‌లో సీఎం పర్యటన

image

ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నేడు హుస్నాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ, ఏటీసీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, గిరిజన గ్రామాలకు కనెక్టివిటీ రోడ్లు, మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి పొన్నం పర్యవేక్షిస్తున్నారు.

Similar News

News February 10, 2026

కొడంగల్‌కు సీఎం రేవంత్

image

TG: CM రేవంత్ రేపు కొడంగల్‌లో పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఉ.11.30గం.కు కొడంగల్‌లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అనంతరం HYDకు తిరిగి పయనమవుతారు. రేపు రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుంది. 8,203 కేంద్రాలు, 16,301 బ్యాలెట్ బాక్సులను EC సిద్ధం చేసింది. మొత్తం 12,930మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

News February 10, 2026

స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ సెంటర్లను పరిశీలించిన కలెక్టర్

image

మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల సాధారణ ఎన్నికలు 2026లో భాగంగా మేడ్చల్ జిల్లాలోని మూడుచింతలపల్లి, ఆలియాబాద్, ఎల్లంపేట్ మున్సిపాలిటీలలో ఎన్నికలకు ఉపయోగించే సామగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను సాధారణ ఎన్నికల పరిశీలకులు నిర్మల కాంతి వెస్లీతో కలిసి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మనూ చౌదరి పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లతోపాటు స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ సెంటర్ల ఏర్పాట్లను తనిఖీ చేశారు.

News February 10, 2026

వైరా: మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై సీపీ నిఘా

image

వైరా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో CP సునీల్ దత్ మంగళవారం పట్టణంలో పర్యటించారు. ముందుగా వైరాలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను సందర్శించి, ఎన్నికల సామగ్రి పంపిణీ, భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న సీపీ.. ఎన్నికల వేళ శాంతిభద్రతల పరిరక్షణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.