News December 3, 2025

నేడు హుస్నాబాద్‌లో సీఎం పర్యటన

image

ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నేడు హుస్నాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ, ఏటీసీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, గిరిజన గ్రామాలకు కనెక్టివిటీ రోడ్లు, మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి పొన్నం పర్యవేక్షిస్తున్నారు.

Similar News

News February 18, 2026

కొచ్చిన్ యూనివర్సిటీలో టెక్నికల్ పోస్టులు

image

<>కొచ్చిన్ <<>>యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో 7 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. ఐటీఐ, డిప్లొమా, BSc(MPC/CS)అర్హత గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని ఫిబ్రవరి 28వరకు పంపాలి. వయసు 18 నుంచి 36ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. టెక్నీషియన్‌కు నెలకు రూ.22,240, టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ.31,020 చెల్లిస్తారు. https://recruit.cusat.ac.in

News February 18, 2026

విజయవాడ మీదుగా సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా సికింద్రాబాద్(SC)- నహర్లగన్(NHLN) మధ్య ప్రత్యేక రైళ్లు(నం.07046,47) నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 27న ఉదయం 8:30 గంటలకు S.Cలో బయలుదేరే ట్రైన్(నం.07046) అదే రోజు మధ్యాహ్నం 2:25కి విజయవాడ చేరుకుంటుందన్నారు, మార్చి 4న మధ్యాహ్నం 1:50కి విజయవాడలో బయలుదేరే ట్రైన్ నం.07047 రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందన్నారు.

News February 18, 2026

అమరావతిలో తొలి అంతర్జాతీయ ప్రభుత్వ బడి

image

ఆంధ్రప్రదేశ్‌లో తొలి అంతర్జాతీయ స్థాయి ప్రభుత్వ పాఠశాల అమరావతిలో రూపుదిద్దుకుంటోంది. నిడమర్రులోని జడ్పీ హైస్కూల్‌ను ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్‌గా మారుస్తున్నారు. సుమారు రూ.15 కోట్ల నుంచి రూ.16 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పేద విద్యార్థులకు ప్రపంచస్థాయి ప్రమాణాలతో విద్యనందించడమే దీని లక్ష్యం.