News September 11, 2025

నేడు ANU 49వ వ్యవస్థాపక దినోత్సవం

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) 49వ వ్యవస్థాపక దినోత్సవం గురువారం ఘనంగా జరగనుంది. 1970లో ఆంధ్ర విశ్వవిద్యాలయం పోస్ట్-గ్రాడ్యుయేట్ కేంద్రంగా గుంటూరు నల్లపాడులో ప్రారంభమైన ఈ యూనివర్సిటీ, 1976 SEP11న స్వతంత్ర విశ్వవిద్యాలయంగా మారింది. అప్పటి భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ చేతుల మీదుగా ఇది ప్రారంభమైంది. ఆచార్య నాగార్జునుడి స్మారకార్థం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంగా పేరు గడించింది.

Similar News

News December 6, 2025

గుంటూరులో ప్రకాశం జిల్లా వాసి అరెస్ట్

image

మహిళ ఫొటోలను మార్ఫింగ్ చేసి FBలో దుష్ప్రచారం చేస్తున్న ప్రకాశం జిల్లా వాసిని గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ వెంకటేశ్వర్లు వివరాల మేరకు.. గుంటూరుకు చెందిన ఓ మహిళ ఫొటోలను గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లికి చెందిన నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి మార్ఫింగ్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు.

News December 6, 2025

తిరుపతి: యువతిపై వేధింపులు నిజమేనా..?

image

తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో <<18490909>>యువతి వేధింపులపై<<>> YCP పోస్ట్ వైరల్ అయ్యింది. మరీ అది నిజమేనా.. కాదా అని తేల్చాసిన బాధ్యత అటు పోలీసులపై.. ఇటు యూనివర్సిటీ అధికారులపై ఉంది. దీనికి సంబంధించి వర్సిటీ వర్గాలు ఎందుకు మౌనంగా ఉన్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై స్పష్టత ఎప్పటికి వచ్చే అవకాశం ఉందోమరి.

News December 6, 2025

MNCL: డేటా నమోదులో తప్పులు ఉండకూడదు: డీఈఓ

image

మంచిర్యాలలోని జిల్లా సైన్స్ కేంద్రంలో శనివారం యూడైస్ (UDISE) వర్క్‌షాప్ జరిగింది. డీఈఓ యాదయ్య మాట్లాడుతూ.. ఎంఈఓలు హెచ్‌ఎంలతో సమీక్ష నిర్వహించి, పాఠశాలల్లోని మౌలిక వసతులు సహా అన్ని వివరాలను తప్పులు లేకుండా ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌డేట్ చేయాలని సూచించారు. యూడైస్ డేటాకు కేటాయించిన 580 మార్కుల ఆధారంగానే జిల్లాకు ర్యాంకు, సౌకర్యాల మంజూరు ఆధారపడి ఉంటుందని ప్లానింగ్ కోఆర్డినేటర్ భరత్ తెలిపారు.