News November 19, 2025
నేడే PM కిసాన్ 21వ విడత డబ్బుల జమ

PM కిసాన్ 21వ విడత నిధులు ఇవాళ విడుదల కానున్నాయి. రబీ పంట పెట్టుబడి సాయం కింద దేశ వ్యాప్తంగా 11 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేలు చొప్పున ప్రధాని మోదీ జమ చేయనున్నారు. 2019 FEB-24న PM కిసాన్ ప్రారంభించగా ఇప్పటి వరకు 20 విడతల్లో రూ.3.70 లక్షల కోట్లకు పైగా నిధులను అన్నదాతల అకౌంట్లలో జమ చేశారు. పీఎం కిసాన్ పోర్టల్‌లో నమోదై, బ్యాంకు ఖాతా ఆధార్‌తో లింక్ అయిన రైతులకే ఈ పథకం ప్రయోజనం అందనుంది.
Similar News
News January 18, 2026
ట్రంప్ మోసం చేశాడు: ఇరాన్ నిరసనకారులు

US అధ్యక్షుడు ట్రంప్ తమకు ద్రోహం చేశారని ఇరాన్ నిరసనకారులు మండిపడుతున్నారు. దాడికి సిద్ధంగా ఉన్నామని, సాయం త్వరలోనే అందుతుందని చెప్పి ఇప్పుడు పట్టించుకోలేదని రగిలిపోతున్నారు. ప్రభుత్వం తమను అణచివేస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు. ‘దేశంలో 15 వేల మంది మరణానికి ట్రంప్ కారణం. మమ్మల్ని ఆయుధాలుగా వాడుకుని మోసం చేశారు. ఖమేనీ ప్రభుత్వంతో డీల్ చేసుకున్నారు’ అని ఆరోపిస్తున్నారు.
News January 18, 2026
మెనోపాజ్‌లో ఒత్తిడి ప్రభావం

మెనోపాజ్ దశలో శరీరంలో తలెత్తే హార్మోన్ల మార్పుల కారణంగా మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం పడుతుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన, చిరాకు, మూడ్ స్వింగ్స్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని అధిగమించే మార్గాల గురించి నిపుణులను, తోటి మహిళలను అడిగి తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి నచ్చిన పనులు చేయడం, కంటి నిండా నిద్ర పోవడం వంటివి చేయాలని సూచిస్తున్నారు.
News January 18, 2026
గిరిజన సంస్కృతికి నిలువుటద్దం ‘నాగోబా జాతర’

ADB(D) కేస్లాపూర్(V)లో గిరిజనులు నాగోబా జాతరను అత్యంత భక్తితో జరుపుకొంటారు. పుష్యమాస అమావాస్య రోజున తమ ఆరాధ్య దైవం నాగోబా నాట్యం చేస్తాడని మెస్రం వంశీయుల నమ్మకం. ఈ పండుగ కోసం గిరిజనులు 100km నడిచి గోదావరి జలాన్ని కలశాల్లో తెస్తారు. అమావాస్య అర్థరాత్రి ఆ పవిత్ర జలంతో స్వామికి అభిషేకం చేయడంతో జాతర ప్రారంభమవుతుంది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వేడుకకు వివిధ రాష్ట్రాల నుంచి లక్షల మంది తరలివస్తారు.


