News May 2, 2024
నేతలకు గుర్తుల గుబులు

2019 BHNR లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 5 వేల ఓట్ల మెజార్టీతో గెలవగా..ఇక్కడ కారును పోలిన రోడ్డు రోలర్ గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థికి ఏకంగా 25 వేల ఓట్లు వచ్చాయి. అప్పట్లో బీఆర్ఎస్ నేతలు సీఈసీకి ఫిర్యాదు చేయడంతో దాన్ని తొలగించారు. ప్రస్తుతం చపాతి రోలర్, రోడ్డు రోలర్ గుర్తులను కేటాయించారు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులకు గుర్తుల గుబులు పట్టుకుంది.
Similar News
News December 16, 2025
నల్గొండలో పోలింగ్‌కు పటిష్ఠ భద్రత

నల్గొండ జిల్లాలో జరుగుతున్న మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు 1500 మంది పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో సెక్షన్ 144 అమల్లో ఉంటుందని, ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడకూడదని హెచ్చరించారు. విజేతల ర్యాలీలు, ఊరేగింపులపై నిషేధం విధించారు.
News December 16, 2025
ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల చివరి విడత నిర్వహణను పగడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రిటర్నింగ్ అధికారులకు సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. దేవరకొండ డివిజన్ పరిధిలోని ఆర్ఓలు, అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, ఆర్డీఓ, ఇతర అధికారులతో ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గత విడతల్లో తలెత్తిన సమస్యలు పునరావృతం కాకూడదని ఆదేశించారు.
News December 16, 2025
పేరుకే కొలువు.. వేతనాలు అందక 9 నెలలు!

నెలల తరబడి వేతనాలందక జిల్లాలోని ‘104’ ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబ పోషణకు కొందరు అప్పులు చేస్తున్నారు. ఇంకొందరి పరిస్థితి దయనీయంగా మారింది. 9 నెలలుగా వేతనాలు సక్రమంగా అందకపోవడంతో అప్పులు చేసి కాలం వెళ్లదీస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 100కు పైగానే 104 సిబ్బంది పని చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు వేతనాలు చెల్లించాలని వారు కోరుతున్నారు.


