News December 2, 2025
నేను కోచ్‌గా ఉంటే బాధ్యత వహించేవాడిని: రవిశాస్త్రి

సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌ను 0-2తో భారత్ కోల్పోవడంపై మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ఈ విషయంలో గంభీర్‌ను ప్రొటెక్ట్ చేయనని అన్నారు. ‘అతడు 100% బాధ్యత వహించాలి. నేను కోచ్‌గా ఉన్నప్పుడు ఇది జరిగి ఉంటే ఓటమికి మొదటి బాధ్యతను తీసుకునే వాడిని. నిజానికి టీమ్ కూడా అంత ఘోరంగా లేదు. కానీ గువాహటిలో 100-1 నుంచి 130-7కి పడిపోయారు. ఆటగాళ్లు మరింత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు.
Similar News
News February 16, 2026
‘సంజీవని’ ప్రాజెక్టు గురించి తెలుసా?

AP: సీఎం చంద్రబాబు, బిల్ గేట్స్ ప్రారంభించే ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ హెల్త్ కార్డులు, ఉచిత వైద్య పరీక్షలు, మాతా శిశు సంరక్షణ సహా ఇతర సేవలు అందనున్నాయి. హెల్త్ రికార్డులు డిజిటల్ చేయడంతో పాటు రూ.2.5 లక్షల ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించనున్నారు. ఇప్పటికే కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా కొనసాగిస్తుండగా రాష్ట్రమంతటా విస్తరించనున్నారు. ఇందులో గేట్స్ ఫాండేషన్‌తో TCS భాగస్వాములు.
News February 16, 2026
రసవత్తరంగా కరీంనగర్, NZB మేయర్ ఎన్నిక!

TG: కాసేపట్లో మేయర్ ఎన్నిక నేపథ్యంలో కరీంనగర్‌లో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక్కడ ఎక్స్‌అఫీషియోతో కలిపి 69(66+3) ఓట్లున్నాయి. ఓటింగ్‌కు దూరంగా ఉండాలని BRS నిర్ణయించడంతో ఓట్ల సంఖ్య 60కి, మ్యాజిక్ ఫిగర్ 31కి మారింది. MP బండి సంజయ్‌తో కలిపి 34 ఓట్లున్న BJPకే మేయర్ పీఠం దక్కే అవకాశం పుష్కలంగా ఉంది. అటు NZBలో BJP 28, CONG 17, MIM 14, BRS 1 సీట్లున్నాయి. CONG-MIM కలిసి మేయర్ పీఠం దక్కించుకోవచ్చు.
News February 16, 2026
బిల్‌గేట్స్ విమానానికి ATC క్లియరెన్స్

AP: విజయవాడలో ల్యాండ్ అయ్యేందుకు బిల్‌గేట్స్ విమానానికి ATC క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో గన్నవరం ఎయిర్‌పోర్టులో ఆయన ఫ్లైట్ ల్యాండైంది. మంత్రులు లోకేశ్, అనిత, సత్యకుమార్, అచ్చెన్నాయుడు, ఉన్నతాధికారులు బిల్‌గేట్స్‌కు స్వాగతం పలికారు. కాసేపట్లో ఆయన రోడ్డు మార్గంలో వెలగపూడిలోని సచివాలయానికి చేరుకోనున్నారు. విజిబిలిటీ లేక అరగంటపాటు విమానం గాల్లో చక్కర్లు కొట్టగా టెన్షన్ వాతావరణం నెలకొంది.


