News September 10, 2025

నేపాల్‌లో చిక్కుకున్న విశాఖ వాసులు

image

విశాఖ నుంచి విహారయాత్రకు వెళ్లిన 11 మంది నేపాల్‌లో చిక్కుకుపోయారు. అక్కడ అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో తిరిగి వచ్చేందుకు అవకాశం లేకపోవడంతో సహాయం కోసం వారి కుటుంబీకులకు సమాచారం అందించారు. ఎంపీ భరత్, మంత్రి లోకేశ్ దృష్టికి కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారు. వీరందరూ ఎల్ఐసీలో ఉద్యోగాలు చేస్తున్నారని, తిరిగి రప్పించేందుకు అన్ని ఏర్పాట్లూ చేస్తామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారన్నారు.

Similar News

News December 9, 2025

నేటి నుంచి లారీల బంద్

image

AP: టెస్టింగ్, ఫిట్‌నెస్ ఛార్జీలను తగ్గించాలనే డిమాండ్‌తో ఇవాళ అర్ధరాత్రి నుంచి గూడ్స్ రవాణా నిలిపివేస్తున్నట్లు లారీ ఓనర్ల సంఘం ప్రకటించింది. దాదాపు 10వేల లారీలు నిలిచిపోనుండటంతో కూరగాయలు, నిత్యావసరాలు, ధాన్యం, రేషన్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడనుంది. 13 ఏళ్ల వాహనాల ఫిట్‌నెస్ ఫీజు గతంలో రూ.1,400 ఉండగా కొత్త నిబంధనల ప్రకారం రూ.33వేలు చెల్లించాల్సి వస్తోందని లారీల ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News December 9, 2025

కామారెడ్డి: ఈరోజు సాయంత్రం నుంచి మైకులు బంద్

image

కామారెడ్డి జిల్లా భిక్కనూర్, దోమకొండ, బీబీపేట్, పల్వంచ, రాజంపేట, కామారెడ్డి రూరల్, సదాశివనగర్, తాడ్వాయి, రామారెడ్డి, మాచారెడ్డి మండలాల్లోని 167 పంచాయతీలకు మొదటి విడతలో భాగంగా 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారం గడువు నేటి సాయంత్రంతో ముగియనుంది. దీంతో అభ్యర్థులు, వారి బంధువులు గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ తమకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

News December 9, 2025

నల్గొండ: ఇవాళ సాయంత్రం నుంచి అంతా గప్ చుప్

image

జీపీ మొదటి విడత ప్రచారానికి ఇవాళ సాయంత్రం తెర పడనుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. NLG జిల్లాలో 14 మండలాల్లో 318, SRPT జిల్లాలో 159, యాదాద్రి జిల్లాలో 138 గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీ పోరులో ఎప్పుడూ పెద్దగా కనిపించని బడా నేతలు సైతం ఈసారి ఈ ఎలక్షన్స్‌ను ప్రతిష్ఠాత్మకంగా భావించి తమ మద్దతుదారుల తరఫున ఓట్లు అభ్యర్థించారు.