News December 3, 2025

నేపియర్ కంటే 4G బుల్లెట్ సూపర్ నేపియర్ ఎందుకు ప్రత్యేకం?

image

నేపియర్ గడ్డి ముదిరితే కాండం కాస్త గట్టిగా ఉంటుంది. 4G బుల్లెట్ సూపర్ నేపియర్ కాండం ముదిరినా లోపల డొల్లగా ఉండి, పాడి పశువు తినడానికి సులువుగా ఉంటుంది. నేపియర్‌తో పోలిస్తే దీనిలో తీపిదనం కాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ గడ్డి చాలా గుబురుగా పెరుగుతుంది. 4G బుల్లెట్ సూపర్ నేపియర్‌లో ప్రొటీన్ కంటెంట్, దిగుబడి, మొక్కలు పెరిగే ఎత్తు, మొక్క ఆకుల్లోని మృదుత్వం.. సాధారణ నేపియర్ గడ్డి కంటే ఎక్కువగా ఉంటుంది.

Similar News

News February 10, 2026

చెరువుల్లో చేపల మరణానికి ప్రధాన కారణం ఇదే

image

చెరువుల్లో చేపల పెంపకంలో ప్రధానంగా ఎదురయ్యే సమస్య ఎక్కువ సంఖ్యలో చేపల మరణాలు. దీనికి వ్యాధులే కారణమని చాలా మంది పెంపకందారులు భావిస్తుంటారు. అయితే చెరువుల్లో నీటి నాణ్యత, సరైన నిర్వహణ లేకపోవడం వల్లే 60-70% చేపల మరణాలు సంభవిస్తున్నాయని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. అందుకే చేపల పెంపకందారులు చెరువుల్లో నీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు.

గుడ్డులోని పచ్చసొనతో కొలెస్ట్రాల్ పెరుగుతుందా?

image

గుడ్డు పచ్చసొన (Yolk) తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని చాలామంది ఎగ్ వైట్ మాత్రమే తింటారు. అయితే పచ్చసొనలో విటమిన్ A, E, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి కీలక పోషకాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. మన శరీరంలోని 85% కొలెస్ట్రాల్‌ను కాలేయమే ఉత్పత్తి చేస్తుంది. ఆహారం ద్వారా వచ్చే కొలెస్ట్రాల్ ప్రభావం తక్కువే. పచ్చసొనలోని పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.