News January 24, 2025
నేరాలకు పాల్పడితే జీవితం జైలుపాలు: ASF జడ్జి

ఆర్థిక స్థోమత లేని ఖైదీలకు ఉచిత న్యాయ సేవలు అందిస్తామని ఆసిఫాబాద్ జిల్లా సెషన్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేష్ అన్నారు. గురువారం మధ్యాహ్నం 3గంటలకు ఆసిఫాబాద్ సబ్ జైల్‌లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఖైదీలకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో ఆయన ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడారు. క్షణికావేశంలో నేరాలకు పాల్పడితే జీవితం జైలు పాలై నాశనం అవుతుందన్నారు.
Similar News
News February 17, 2025
KGHలో ఆమె జీబీఎస్‌తో చనిపోలేదు..!

విశాఖ KGHలో ఓ వృద్ధురాలు గుండెపోటుతో చనిపోయిందని సూపరింటెండెంట్ శివానంద్ చెప్పారు. ‘విజయనగరం(D) L.కోట మండలానికి చెందిన వృద్ధురాలు(63) గుయిలెయిన్-బారే సిండ్రోమ్(జీబీఎస్) అనుమానాస్పద లక్షణాలతో ఫిబ్రవరి 6న KGHలోచేరారు. ఆమెకు షుగర్, బీపీ ఉన్నాయి. మేం అందజేసిన చికిత్సతో కాస్త కోలుకున్నారు. ఇవాళ ఛాతీ నొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. గుండెపోటుతో చనిపోయినట్లు తేలింది. ఆమె GBSతో చనిపోలేదు’ అని ఆయన తెలిపారు.
News February 17, 2025
పండ్ల మార్కెట్లో అగ్నిప్రమాదం

AP: రాజమండ్రి దివాన్‌చెరువులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పండ్ల మార్కెట్‌లోని కోల్డ్ స్టోరేజ్ గోడౌన్ నుంచి మంటలు ఎగిసి పడుతున్నాయి. వ్యాపారులు వెంటనే భయంతో బయటకు పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.
News February 17, 2025
ప్రార్థనా స్థలాల చట్టం కేసు: సుప్రీంకోర్టు అసంతృప్తి

ప్రార్థనా స్థలాల చట్టం కేసుపై కుప్పలు తెప్పలుగా కొత్త పిటిషన్లు రావడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో ముగ్గురు సభ్యుల బెంచ్ వాదనలు వినడంతో ఇద్దరితో కూడిన తమ బెంచ్ పెండింగ్ పిటిషన్లను తీసుకోబోదని CJI సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ‘పిటిషన్లు వేయడానికీ ఓ పరిమితి ఉంటుంది. తాజాగా మరిన్ని వచ్చాయి. వాటిని మేం స్వీకరించలేం. మార్చిలో కొత్త తేదీ ఇస్తాం’ అని తెలిపారు.