News October 8, 2025
నేరాల నియంత్రణకు నిఘా నేత్రాలు ఏర్పాటు చేయాలి: ఎస్పీ

ఎస్పీ రోహిత్ రాజు మంగళవారం కొత్తగూడెం డిఎస్పీ కార్యాలయాన్ని సందర్శించారు. ముందుగా డీఎస్పీ రెహమాన్ ఎస్పీ రోహిత్ రాజుకు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లో పెండింగ్లో ఉన్న పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.
Similar News
News January 14, 2026
హనుమకొండ ఖాళీ.. నిర్మానుష్యంగా రోడ్లు!

సంక్రాంతి సందర్భంగా హనుమకొండ నగరం ఖాళీ అయింది. రోడ్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. పట్టణ ప్రజలంతా పండగ కోసం పల్లెబాట పట్టారు. నిత్యం రద్దీగా ఉండే హన్మకొండ చౌరస్తా, బస్టాండ్ ప్రాంతం, పెట్రోల్ పంప్ ఏరియా ఖాళీగా కనిపించింది. పట్టణ ప్రజలంతా గ్రామాల్లోకి వెళ్లడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.
News January 14, 2026
భూపాలపల్లి: ఆన్లైన్లో సకినాలు ఆర్డర్..!

ఇంట్లో అప్పాలు, పిండి వంటలు చేయలేక ఆన్లైన్లో ఆర్డర్లు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు సంక్రాంతి వచ్చిందంటే పల్లెలతో పాటు పట్టణల్లో సందడిగా ఉండేది. సంక్రాంతి ముగ్గులతో పాటు సకినాలు ఫేమస్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పని చేతకాకనో, బిజీలైఫ్ వల్లో మొత్తానికి ఒక్క సంక్రాంతి పండగే కాక అన్ని పండగలకు అప్పాలు, పిండి వంటలు, హోమ్ ఫుడ్ లేదా ఆన్లైన్ ద్వారా ఆర్డర్లు చేస్తున్నారు. ఈజీగా అప్పాలు తినేస్తున్నారు.
News January 14, 2026
ప్రధాని మెచ్చిన కాకినాడ యువకుడి ఐడియా

కాకినాడ జిల్లా కేఈ చిన్నయ్యపాలెం గ్రామానికి చెందిన యువకుడు కొరుప్రోలు శివ మణికంఠ జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు సాధించారు. ఈనెల 12న ఢిల్లీలో జరిగిన ‘వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్–2026’లో ఆయన పాల్గొని, వ్యవసాయ రంగంలో తనకున్న వినూత్న ఆలోచనలను ప్రధాని మోదీ సమక్షంలో ప్రదర్శించారు. శివ మణికంఠ టాప్-5 ఐడియా విభాగంలో నిలవడం విశేషం. ఈ యువకుడి ఘనతపై జిల్లా వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.


