News August 12, 2025
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో ముఖ్యం: KMR ఏఎస్పీ

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో ముఖ్యమని అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి సూచించారు. మంగళవారం కామారెడ్డిలోని గాంధీ గంజ్ ఆవరణలో డీసీఎం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 15 సీసీ కెమెరాలను ఆమె ప్రారంభించారు. డీసీఎం యూనియన్ సభ్యులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ పోలీస్ సిబ్బందికి సహకరించాలన్నారు.
Similar News
News March 6, 2026
కామారెడ్డి: ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షకు 97.92 శాతం హాజరు

కామారెడ్డి జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు 97.92 శాతం హాజరు నమోదైనట్లు నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 6,585 మంది విద్యార్థులకు గాను 6,448 మంది హాజరయ్యారని, 137 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాల వద్ద అన్ని వసతులు కల్పించినట్లు ఆయన వివరించారు.
News March 6, 2026
పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్‌పై నెట్టింట ప్రశంసలు

పిల్లలను SM తప్పుదారి పట్టిస్తోందని దీనిని బ్యాన్ చేయడం కరెక్టేనని తల్లిదండ్రుల నుంచి అభిప్రాయం వినిపిస్తోంది. తాజాగా KA ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వీరు ఆహ్వానిస్తున్నారు. నేర్చుకునేందుకు SMలో ఎంతో మంచి కంటెంట్ ఉంటే పిల్లలు మాత్రం తప్పుదారి పట్టించే వీడియోలవైపే అట్రాక్ట్ అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు ఏకాగ్రతగా చదువుకోవాలంటే ఇలాంటి కఠిన నిర్ణయాలు అవసరమంటున్నారు. మీ కామెంట్?
News March 6, 2026
కాకినాడ GGHలో సెక్యూరిటీ గార్డుల ఘర్షణ

కాకినాడ GGHలో సెక్యూరిటీ గార్డుల దౌర్జన్యం శృతిమించింది. శుక్రవారం గార్డులు 2వర్గాలుగా విడిపోయి బాహాబాహీకి దిగడంతో పలువురు గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. వీరి ఆగడాలపై ‘Way2News’ ఇప్పటికే కథనం ప్రచురించగా, సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని బాధితులు వాపోతున్నారు. ఆసుపత్రి ఛైర్మన్ హోదాలో జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి, సెక్యూరిటీ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


