News May 7, 2025
నేలకొండపల్లి రైస్ మిల్లును సందర్శించిన సీపీ

నేలకొండపల్లి మండలంలో గల జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం కేంద్రాన్ని, రాజేశ్వరపురంలోని రైస్ మిల్లును శుక్రవారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పరిశీలించారు. ధాన్యం కొనుగోళ్లు, రవాణా, కాంటాలు, బిల్లులు వంటి అంశాలపై రైతులు, మిల్లర్లతో మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని, మిల్లర్లకు, అధికారులకు సూచించారు.
Similar News
News February 12, 2026
రేపు యథావిధిగా రవాణా శాఖ సేవలు: డీటీఓ

ఖమ్మం జిల్లాలోని రవాణా శాఖ కార్యాలయాల్లో రేపు అన్ని రకాల సేవలు యధావిధిగా అందుబాటులో ఉంటాయని డీటీఓ ధర్మపురి జగదీష్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన కార్యాలయంతో పాటు సత్తుపల్లి, వైరాలోని ఆర్టీఏ కార్యాలయాల్లోనూ కార్యకలాపాలు సాగుతాయని స్పష్టం చేశారు. దరఖాస్తుదారులు ముందస్తుగా స్లాట్లు బుక్ చేసుకోవచ్చని, వాహన రిజిస్ట్రేషన్లు, లైసెన్సుల జారీ తదితర సేవల కోసం కార్యాలయాలకు రావచ్చని పేర్కొన్నారు.
News February 12, 2026
ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాలలో ‘కెమ్ డ్రా’ కోర్సు ప్రారంభం

ఖమ్మం ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘కెమ్ డ్రా’ సర్టిఫికెట్ కోర్సును బుధవారం ప్రిన్సిపాల్ మహ్మద్ జకీరుల్లా ప్రారంభించారు. రసాయన పదార్థాల నిర్మాణాలు, వాటి పేర్లను సులభంగా అర్థం చేసుకోవడానికి ఈ సాఫ్ట్‌వేర్ కోర్సు విద్యార్థులకు ఎంతగానో దోహదపడుతుందని ఆయన తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో కెమిస్ట్రీపై పట్టు సాధించేందుకు ఇదొక మంచి అవకాశమని పేర్కొన్నారు.
News February 12, 2026
ఖమ్మం జిల్లాలో టాప్ కల్లూరు

కల్లూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటర్లు భారీగా తరలివచ్చారు. జిల్లాలోనే అత్యధికంగా 87.08 శాతం పోలింగ్ నమోదైనట్లు మున్సిపల్ కమిషనర్ ఎం. రామదుర్గారెడ్డి వెల్లడించారు. మొత్తం 18,866 ఓట్లకు గానూ 16,428 ఓట్లు పోలయ్యాయి. 20 వార్డుల్లో నిర్వహించిన పోలింగ్‌లో 6వ వార్డు 94.85 శాతంతో అగ్రస్థానంలో నిలవగా, 20వ వార్డులో 75.85 శాతం పోలింగ్ నమోదైంది.


