News December 1, 2025

నేవీ అధికారి భార్యను రైలు నుంచి తోసేసిన TTE!

image

యూపీలో నేవీ అధికారి భార్య మృతి కేసులో రైల్వే టీటీఈపై కేసు నమోదైంది. నవంబర్ 26న వైద్యం కోసం ఢిల్లీకి బయలుదేరిన ఆర్తి(30) పొరపాటున మరో ట్రైన్ ఎక్కారు. టికెట్ విషయమై ఆర్తికి TTEతో వివాదం తలెత్తగా లగేజ్‌తో పాటు ఆమెను బయటకు తోసేశాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే చనిపోయిందన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో ఘటనపై ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నట్లు GRP అధికారులు తెలిపారు.

Similar News

News February 10, 2026

BOB క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

BOB క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్‌ మేనేజర్, AVP ఫైనాన్స్& అకౌంట్స్, స్టేట్ హెడ్ రిటైల్ బ్రోకింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు నేటి నుంచి ఫిబ్రవరి 28 వరకు careers@bobcaps.in ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. పోస్టును బట్టి డిగ్రీ, PG/CA/MBA అర్హతతో పాటు పనిఅనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://www.bobcaps.in

News February 10, 2026

ఇండియా-పాక్ మ్యాచ్.. విమాన టికెట్లకు రెక్కలు

image

T20 ప్రపంచకప్‌లో ఇండియాతో మ్యాచ్ విషయంలో <<19097488>>పాక్ యూటర్న్<<>> తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్ జరగనున్న కొలంబోకు విమాన టికెట్ల ధరలు భారీగా ఎగిశాయి. ఇండియాతో ఆడతామని పాక్ ప్రకటించిన నిమిషాల్లోనే ఏకంగా రూ.10 వేలు పెరిగాయని సమాచారం. ప్రస్తుతం పోను రాను టికెట్ ధర రూ.60 వేలుగా ఉన్నట్లు తెలుస్తోంది. మ్యాచ్‌కు ఇంకా 5 రోజులుండటంతో ఈ రేట్లు భారీగా పెరిగే అవకాశం ఉంది.

News February 10, 2026

పాక్ యూటర్న్ విలువ ₹1,500 కోట్లు!

image

భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్‌పై పాక్ యూటర్న్ తీసుకోవడంతో ICC సహా గ్లోబల్ బ్రాడ్‌కాస్టర్లకు దాదాపు ₹1,500 కోట్ల ఆదాయం మిగిలింది. మ్యాచ్ రద్దయి ఉంటే మీడియా పార్ట్‌నర్ అయిన జియోహాట్‌స్టార్‌కు ICC భారీ పరిహారం ఇవ్వాల్సి వచ్చేది. అలాగే 10 సెకన్ల యాడ్‌కు ₹25-40 లక్షల చొప్పున సుమారు ₹200-300 కోట్ల యాడ్ రెవెన్యూ పోయేది. స్పాన్సర్‌షిప్‌లు, డిజిటల్ ట్రాఫిక్, హోటల్ బుకింగ్‌ల రూపంలో మరింత లాస్ తప్పేది కాదు.