News August 20, 2025

నైని కోల్ బ్లాక్‌ను పరిశీలించిన సింగరేణి డైరెక్టర్ & సీవీవో

image

సింగరేణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీవీవో బి.వెంకన్న, ఒడిశాలోని అంగుల్ కొత్తగూడెం జిల్లాలోని నైని కోల్ బ్లాక్‌ను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఓపెన్ కాస్ట్ గనుల ఉత్పత్తి, స్టాక్‌యార్డ్, డిస్పాచ్ కార్యకలాపాలను ఆయన సమీక్షించారు. ఈ పర్యటనలో సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి. సూర్యనారాయణ, నైని ఏరియా జీఎం కూడా పాల్గొన్నారు. పర్యటన అనంతరం బొగ్గు సరఫరా చర్యలపై చర్చించారు.

Similar News

News January 19, 2026

MNCL: మోడల్ స్కూల్స్‌లో ప్రవేశాలు

image

2026- 27 విద్యా సంవత్సరానికి మంచిర్యాల జిల్లాలోని తెలంగాణ మోడల్ స్కూల్స్‌లో 6వ తరగతిలో మొత్తం సీట్లు, 7 నుంచి 10వ తరగతులలో మిగులు సీట్లకు దరఖాస్తులు చేసుకోవాలని డీఈవో యాదయ్య తెలిపారు. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు telanganams.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 6వ తరగతికి 19-04-2026న ఉ.10 గంటల నుంచి 12 వరకు, 7 నుంచి 10వ తరగతి వారికి మ.2- సాయంత్రం 4గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు.

News January 19, 2026

ఏలూరు: 130 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు

image

ఏలూరు జిల్లాలోని 130 పరీక్షా కేంద్రాల్లో జనవరి 21 నుంచి మార్చి 24 వరకు జరుగు ఇంటర్ పరీక్షలకు 34,615 మంది విద్యార్ధులు హాజరుకానున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి సోమవారం తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. పరీక్షా పత్రాలను స్ట్రాంగ్ రూంలలో భద్రపరచాలని, ఆయా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్త్ పకడ్బందీగా ఏర్పాటుచేయాలన్నారు. 

News January 19, 2026

‘దండోరా’పై జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసలు

image

శివాజీ, నవదీప్, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన ‘దండోరా’ సినిమాపై హీరో Jr NTR ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా గాఢమైన భావోద్వేగాలతో ఆలోచింపజేసే విధంగా ఉందని అభిప్రాయపడ్డారు. నటీనటులందరి ప్రదర్శన అద్భుతమని తెలిపారు. దర్శకుడు మురళీకాంత్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని అన్నారు. ఈ సినిమా JAN 14 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.