News August 21, 2025

నైపుణ్య పోటీలకు దరఖాస్తు ఆహ్వానం: కలెక్టర్

image

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించే నైపుణ్య పోటీలకు యువత రిజిస్టర్ చేసుకోవాలని కలెక్టర్ చేతన్ పిలుపునిచ్చారు. గురువారం RSETI శిక్షణ కేంద్రంలో కలెక్టర్ నైపుణ్య పోటీలకు సంబంధించి పోస్టర్ను ఆవిష్కరించారు. జిల్లాలోని 18 నుంచి 25 ఏండ్ల వయస్సు గల వారికి 63 విభాగాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆసక్తి కలిగిన వారు http://www.Naipunyam.ap.gov.in/ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు.

Similar News

News January 19, 2026

విశాఖ: ఫిర్యాదులు చేసేందుకు ఎవరూ రాలేదు!

image

ప్రతి సోమవారం జీవీఎంసీలో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ 10 గంటలకు ప్రారంభమైనా ఫిర్యాదుదారులు కనిపించలేదు. మరోవైపు అధికారులు కూడా సగానికి పైగా లేకపోవడం విశేషం. అన్ని సీట్లు ఖాళీగా దర్శనం ఇవ్వడంతో వచ్చిన వారు విస్తుపోతున్నారు. పండగ ఎఫెక్ట్ కారణంగా ఈ పరిస్థితి ఎదురైందని పలువురు భావిస్తున్నారు.

News January 19, 2026

మాస్టర్‌చెఫ్ ఇండియాలో మెరిసిన ‘HYD ఫైర్ పాన్ వాలా’

image

భాగ్యనగరపు అద్భుతమైన ఆహార వైభవం మరోసారి జాతీయ స్థాయిలో సత్తా చాటింది. తన విభిన్నమైన శైలితో HYD వీధుల్లో ‘ఫైర్ పాన్ వాలా’గా గుర్తింపు పొందిన హుస్సేన్, ప్రముఖ కుకింగ్ రియాలిటీ షో ‘మాస్టర్‌చెఫ్ ఇండియా సీజన్ 9’లో అడుగుపెట్టారు. వేల రకాల పాన్‌లను తయారు చేయడంలో రికార్డు సృష్టించిన హుస్సేన్, వీల్‌చైర్‌కే పరిమితమైనా తన ఆత్మవిశ్వాసంతో మాస్టర్‌చెఫ్ వేదికపై జడ్జీలను ఆశ్చర్యపరిచారు.

News January 19, 2026

INC అంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్: బండి

image

TG: సీఎం రేవంత్ <<18890595>>వ్యాఖ్యలకు<<>> కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. INC ఇప్పుడు ఇటలీ నేషనల్ కాంగ్రెస్‌గా మారిందన్నారు. స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెస్‌ను రద్దు చేయాలన్న గాంధీ విష్‌ను ఆ పార్టీ నెరవేర్చలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక 70 ఏళ్ల కాంగ్రెస్ బానిసత్వ ఆలోచనలను తొలగిస్తున్నామన్నారు. సీఎం స్కిల్స్ యూనివర్సిటీలో పాలిటిక్స్ కోర్సును చేర్చి విద్యార్థిగా చేరాలని చురకలు అంటించారు.