News November 5, 2025

న్యూయార్క్ మేయర్‌గా జోహ్రాన్ మమ్‌దానీ

image

అమెరికా ఆర్థిక రాజధాని అయిన న్యూయార్క్ నగర మేయర్‌గా జోహ్రాన్ మమ్‌దానీ (34) ఎన్నికయ్యారు. ఈ ఘనత సాధించిన తొలి ముస్లిం, భారతీయ మూలాలు ఉన్న వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. ఈ శతాబ్దంలో అత్యంత పిన్న వయసులో న్యూయార్క్ మేయర్ అయిన ఘనత కూడా ఈయనదే. డెమొక్రటిక్ పార్టీ నుంచి పోటీ చేసిన జోహ్రాన్ స్వతంత్ర అభ్యర్థి ఆండ్రూపై గెలిచారు. మమ్‌దానీ తల్లిదండ్రులు ఇండియాలో జన్మించారు.

Similar News

News January 17, 2026

సైలెంట్‌గా దెబ్బకొట్టిన ఇండియా.. అమెరికా పప్పులపై 30% టారిఫ్స్

image

అమెరికా టారిఫ్స్‌కు వాటితోనే సైలెంట్‌గా బదులిచ్చింది ఇండియా. US పప్పుధాన్యాల ఎగుమతులపై 30% సుంకం విధించింది. నవంబర్ 1 నుంచే ఇది అమల్లోకి వచ్చింది. ట్రంప్‌కు సెనేటర్లు రాసిన లేఖతో ఇది బయటపడింది. ఈ టారిఫ్స్ వల్ల US రైతులపై చాలా ప్రభావం పడుతుందంటూ వారు వాపోయారు. ప్రపంచంలో పప్పుధాన్యాల అతిపెద్ద వినియోగదారు భారత్(27%). USపై కేంద్రం సైలెంట్‌గానే ప్రతీకారం తీర్చుకుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

News January 17, 2026

మున్సిపల్ ఎన్నికల శంఖం పూరించిన రేవంత్

image

TG: పాలమూరు వేదికగా సీఎం రేవంత్ మున్సిపల్ ఎన్నికల సమరశంఖం పూరించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులనే బీఆర్ఎస్ ఓట్లు అడగాలని కేసీఆర్‌కు సవాల్ విసిరారు. తన సవాల్‌ను స్వీకరిస్తారా అని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లో తాము ఓట్లు అడుగుతామని స్పష్టం చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్‌ను గెలిపించాలని ఓటర్లను కోరారు.

News January 17, 2026

రేపు దావోస్‌కు సీఎం చంద్రబాబు బృందం

image

AP: వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF)లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం రేపు దావోస్ వెళ్లనుంది. 4 రోజుల పాటు వివిధ పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. 20 దేశాల తెలుగు ప్రజలను ఉద్దేశించి CM ప్రసంగించనున్నారు. UAE మంత్రి అబ్దుల్లా, టాటాసన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, గూగుల్ క్లౌడ్ CEO థామస్ కురియన్‌తో భేటీ కానున్నారు. మొత్తం 36 కార్యక్రమాల్లో పాల్గొంటారు. 23న HYD చేరుకోనున్నారు.