News February 18, 2025
పంగులూరు వచ్చిన వివాదాస్పద మహిళా అఘోరీ

ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకెక్కిన మహిళా అఘోరీ వైజాగ్ నుంచి చెన్నై వెళ్తూ సోమవారం పంగులూరు మండలంలోని జాగర్లమూడివారి పాలెం వచ్చింది. విశ్రాంతి కోసం ఆగిన ఆమెను చూడడానికి చుట్టుపక్కల ప్రజలు భారీగా వచ్చారు. దీంతో హైవే మీద ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు వారిని నియంత్రించి ఆమెను అక్కడి నుంచి పంపించి, ట్రాఫిక్ క్లియర్ చేశారు.
Similar News
News March 25, 2025
ADB: అక్రెడిటేషన్ గడువు పొడగింపు

మీడియా అక్రెడిటేషన్ కార్డుల గడువు ఈనెల 31 వరకు ముగియనున్న నేపథ్యంలో వాటి గడువు మరో మూడు నెలలు పొడగించినట్లు ఆదిలాబాద్ పౌర సంబంధాల అధికారిణి తిరుమల పేర్కొన్నారు. గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. జిల్లాలోని పాత్రికేయుంతా మంగళవారం నుండి అక్రెడిటేషన్ కార్డ్స్ పై స్థిక్కర్లు వేయించుకోవాలి కోరారు.
News March 25, 2025
BSNL యూజర్లకు అలర్ట్

కేవైసీ కంప్లీట్ చేయకపోతే 24 గంటల్లో సిమ్ బ్లాక్ అవుతుందని నోటీసులు వస్తే స్పందించవద్దని యూజర్లకు BSNL సూచించింది. ఇటీవల పలువురు యూజర్లకు ఇలాంటి నోటీసులు వచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందని, కానీ తాము ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని స్పష్టం చేసింది. స్కామర్లు KYC పేరిట యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని తెలిపింది. వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
News March 25, 2025
KMR: జర్నలిస్ట్‌ల అక్రడిటేషన్ కార్డుల గడువు పెంపు

రాష్ట్ర, జిల్లా జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల చెల్లుబాటు వ్యవధిని 3 నెలల పాటు పొడిగించినట్లు కొత్త మార్గదర్శకాలతో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఐ&పీఆర్ విభాగం వర్కింగ్ జర్నలిస్టులను అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అసౌకర్యాన్ని చెల్లుబాటును మూడు నెలల పాటు పొడిగించారన్నారు.