News December 1, 2025

పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి: పరిశీలకులు

image

గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని సాధారణ పరిశీలకులు సర్వేశ్వర్ రెడ్డి అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్‌లో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్, పరిశీలకులు సర్వేశ్వర్ రెడ్డి, వ్యయ పరిశీలకురాలు లావణ్యతో కలిసి నోడల్ అధికారులు, ఏఓ, ఏఈఓలతో సమీక్ష జరిపారు. ఏర్పాట్లు, నిర్వహణ, భద్రత, పోలింగ్‌ అంశాలపై ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు.

Similar News

News February 18, 2026

విశాఖ సాగర్ తీరంలో జెట్ ఫైటర్ల విన్యాసాలు (వీడియో)

image

అంతర్జాతీయ ప్లేట్ రివ్యూలో భాగంగా భారత వైమానిక దళానికి చెందిన జెట్ ఫైటర్లు విశాఖ సముద్రతీరంలో అద్భుత విన్యాసం చేశాయి. ఒకేసారి ఏడు జెట్ ఫైటర్లు సముద్రానికి దగ్గరగా వెళ్తూ పల్టీలు కొట్టడం, బాంబులు వదిలే విన్యాసాలు నిర్వహించారు. తీరానికి శత్రుదేశం నౌకలు ఏమైనా చేరుకుంటే వాటిని ఎలా పేల్చాలో కళ్లకు కట్టినట్లు చూపించారు.

News February 18, 2026

నిజామాబాద్: యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం ఫకీరాబాద్ సమీపంలో బైక్ యాక్సిడెంట్ జరిగి గణపతి అనే వ్యక్తి మరణించాడని ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. ఈనెల 9న సాయంత్రం బైక్‌పై బోధన్ నుంచి బాసర వెళ్తుండగా మార్గమధ్యలో ఫకీరాబాద్ సమీపంలో బైక్ స్కిడ్ అయి తీవ్రంగా గాయపడ్డారన్నారు. అనంతరం గణపతి నిజామాబాద్‌లో చికిత్స పొందుతూ ఈరోజు మృతిచెందారని చెప్పారు. మృతుడి భార్య సువర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.

News February 18, 2026

పోలవరం జిల్లా నోడల్ ఆఫీసర్‌గా విశ్వనాథ్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక(గ్రీవెన్స్) పోలవరం జిల్లా నోడల్ ఆఫీసర్‌గా రంపచోడవరం డ్వామా APD. విశ్వనాథ్ బుధవారం నియమితులయ్యారు. ఈ మేరకు కలెక్టర్ దినేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయి గ్రీవెన్స్‌లో వచ్చిన ప్రతీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని విశ్వనాథ్ అన్నారు. జేసీ స్మరణ్ రాజ్ ఆదేశాల మేరకు అధికారుల సహకారం‌తో గ్రీవెన్స్ నిర్వహిస్తామని తెలిపారు.