News May 23, 2024
పంటల సాగుకు సిద్ధమవుతున్న ఖమ్మం జిల్లా రైతులు

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇటీవల భారీ వర్షాలు కురవడంతో పంటలను సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. రేపటి నుంచి రోహిణి కార్తీ రానుంది. ఈ నేపథ్యంలో కార్తి వచ్చిన వెంటనే పంటలు సాగు చేసేందుకు ఇప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాలలో రైతులు దుక్కులు దున్ని సిద్ధం చేసి ఉంచారు. సకాలంలో వర్షాలు కురుస్తుండడం వల్ల రైతులు పెద్ద ఎత్తున మెట్ట పంటల సాగుకు సిద్ధమవుతున్నారు.
Similar News
News March 10, 2026
ఖమ్మం జిల్లాలో తొలి ‘కుసుమ్’ సోలార్ ప్లాంట్ ప్రారంభం

తిరుమలాయపాలెం మండలం జూపెడ గ్రామంలో ప్రధానమంత్రి కుసుమ్ (PM-KUSUM) పథకం కింద ఏర్పాటు చేసిన 2 మెగావాట్స్ సౌర విద్యుత్ ప్లాంట్‌ను మంగళవారం ప్రారంభించారు. రైతు బీరవల్లి శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌ను ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. జిల్లాలో ఈ పథకం కింద ప్రారంభమైన తొలి సోలార్ ప్లాంట్ ఇదే. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
News March 10, 2026
ఖమ్మం: ఇంటర్ పరీక్షలో విద్యార్థిపై మాల్‌ప్రాక్టీస్ కేసు

ఖమ్మం జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడిన ఓ విద్యార్థిపై మాల్‌ప్రాక్టీస్ కేసు నమోదైంది. జిల్లా కేంద్రంలోని ఓ కేంద్రంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు డీఐఈఓ రవిబాబు వెల్లడించారు. సోమవారం జరిగిన మొదటి సంవత్సరం పరీక్షకు 17,849 మంది హాజరుకాగా, 502 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
News March 10, 2026
ఖమ్మం: చెక్కు బౌన్స్.. నిందితుడికి జైలు శిక్ష

చెక్కు బౌన్స్ కేసులో శ్రీరాంనగర్‌కు చెందిన జి.విద్యాసాగర్‌కు ఖమ్మం కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. 2017లో బానోత్ శరత్ వద్ద తీసుకున్న రూ.2 లక్షల అప్పు కోసం విద్యాసాగర్ ఇచ్చిన చెక్కు తిరస్కరణకు గురైంది. విచారణలో నేరం రుజువు కావడంతో న్యాయాధికారి బెక్కమ్ రజని నిందితుడికి 3 నెలల జైలు శిక్షతో పాటు, బాధితుడికి రూ.2 లక్షల నష్టపరిహారం చెల్లించాలని సోమవారం తీర్పునిచ్చారు.


