News August 13, 2025
పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్లు పూర్తి: PO

రంపచోడవరం ప్రభుత్వం జూనియర్ కళాశాల ఆవరణలో ఆగస్టు 15న జరిగే స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేశామని ITDA. PO. సింహాచలం తెలిపారు. అన్ని శాఖల అధికారులు తమ కార్యాలయాల వద్ద జాతీయ జెండా ఆవిష్కరించుకుని, అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. ప్రజా ప్రతినిధులు, ప్రజలు తరలి రావాలని కోరారు.
Similar News
News March 13, 2026
వరంగల్: టెన్త్ పరీక్షలకు గ్యాస్ కష్టాలు!

వారం రోజుల్లో ముగించాల్సిన పది పరీక్షలను నెల పాటు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈనెల 14 నుంచి వచ్చే నెల 13 వరకు పరీక్షలను నిర్వహించేలా ప్లాన్ చేశారు. ఒక్కో పరీక్షకు 5 రోజుల పాటు విరామం ఇచ్చారు. ఇరాన్ యుద్దంతో ఇప్పటికే గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. మరో నెల పాటు పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5,17,727 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరిలో సగం మంది హస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్నారు.
News March 13, 2026
యుద్ధం.. నెల్లూరు జిల్లాలో భారీగా తగ్గిన ధరలు

ఏటా వేసవిలో గూడూరు నిమ్మ మార్కెట్‌లో ధరలు పెరుగుతుంటాయి. ఇప్పుడు ఎండలు మండిపోతున్నా ధరలు పడిపోతున్నాయి. కారణం యుద్ధం. విదేశాలకు ఎగుమతులు ఆగిపోయాయి. చిన్న హోటల్స్ నుంచి 5స్టార్ హోటల్స్ వరకు నిమ్మకాయలు కొంటారు. గ్యాస్ కొరతతో హోటళ్లు మూత పడటంతో ధరలు భారీగా తగ్గిపోయాయి. 2రోజుల కిందట KG నిమ్మకాయలు రూ.110 ఉండగా నేడు కేజీ రూ.80-రూ.85 మాత్రమే ఉంది. మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
News March 13, 2026
ఆల్మట్టి ఎత్తు పెంపు.. కృష్ణా బేసిన్‌లో కలవరం

ఆల్మట్టి డ్యాం ఎత్తును 519.6 నుంచి 524.25 మీటర్లకు పెంచే దిశగా కర్ణాటక ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. కృష్ణా ఎగువ ప్రాజెక్టు మూడో విడతలో భాగంగా ఎత్తు పెంచి 130 నుంచి 250పైగా TMCల అదనపు నీటిని నిల్వ చేయాలని భావిస్తోంది. దీనికి TG, AP దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే జరిగితే పాలమూరు నీటి లభ్యత భారీగా తగ్గిపోనుంది. భూ సేకరణ, పునరావాసానికి కర్ణాటక ప్రభుత్వం రూ.70 కోట్లు కేటాయించింది.


