News December 1, 2025

పచ్చదనంతో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ..!

image

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని గ్రీన్ క్యాంపస్ కాన్సెప్ట్‌తో ఆధునికంగా నిర్మిస్తున్నారు. 160.4 ఎకరాల్లో జరుగుతున్న పనుల్లో ఇప్పటికే 75% పూర్తయ్యాయి. సహజ వెలుతురు వినియోగం కోసం గ్లాస్ రేకులు అమర్చుతూ విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తున్నారు. నీటి సంరక్షణ లక్ష్యంగా చెరువులు, రైన్వాటర్ నిల్వ సదుపాయాలు, వ్యర్థ జల రిసైక్లింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఫ్యాక్టరీ చుట్టూ భారీగా పచ్చదనం పెంచనున్నారు.

Similar News

News February 7, 2026

MBNR: నేడు పరీక్ష.. 4,592 మంది పోటీ

image

జవహర్ నవోదయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 9, 11 తరగతిలో మిగులలు సీట్ల భర్తీకి నేడు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. 11వ తరగతికి ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, 9వ తరగతికి ఉదయం 11:15 నుంచి మధ్యాహ్నం 1:45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 19 కేంద్రాల్లో 4,592 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నట్లు వట్టెం ప్రిన్సిపల్ భాస్కర్ కుమార్ తెలిపారు.

News February 7, 2026

రేపు సూర్యుడిని ఎందుకు పూజించాలి?

image

రేపు భాను సప్తమి. దీన్నే ‘ఆరోగ్య సప్తమి’ అని కూడా అంటారు. ఈ రోజున సూర్యోదయానికి ముందే పవిత్ర నదులలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు తొలగిపోయి, శరీరం శుద్ధి అవుతుందని నమ్ముతారు. సూర్యరశ్మిలోని శక్తి మన శారీరక, మానసిక అనారోగ్యాలను నయం చేస్తుంది. నిష్ఠతో ఉపవాసం ఉండి సూర్యుడిని పూజించే వారికి గత జన్మల పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా, ఏడాది పొడవునా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేలా దైవిక రక్షణ లభిస్తుంది.

News February 7, 2026

అన్నమయ్య: వేలాది కోళ్ల మృతి.. కారణం ఇదే..!

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా సదుం మండలంలో వేలాది నాటు కోళ్లు చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో కంభంవారిపల్లె క్రాస్ వద్ద ఉన్న కోళ్ల ఫారాన్ని పశుసంవర్ధక శాఖ జేడీ ఉమాదేవి, జిల్లా అధికారులు శుక్రవారం పరిశీలించారు. వీటి నమూనాలను భోపాల్ ల్యాబ్ పంపించామని చెప్పారు. త్వరలోనే నివేదిక వస్తుందన్నారు. ప్రస్తుతం తమకున్న నివేదిక ప్రకారం దీనిని కొక్కర తెగుళ్లుగా భావిస్తున్నామన్నారు.