News September 10, 2025
పటాన్‌చెరులో యాక్సిడెంట్.. మహిళ మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ORRపై జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళను గుర్తు తెలియని వాహనం ఢీకొనగా అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 12, 2025
3 దేశాల పర్యటనకు ప్రధాని మోదీ

PM మోదీ ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల్లో పర్యటించనున్నారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా-2 బిన్ ఆల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు PM ముందుగా ఆ దేశానికి వెళ్తారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక బంధాలు మొదలై 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ భేటీ కీలకం కానుంది. అక్కడి నుంచి ఇథియోపియా వెళ్తారు. ఆ దేశానికి ప్రధాని వెళ్లడం ఇదే తొలిసారి. ఆ దేశంలో చర్చల అనంతరం ఒమన్ చేరుకొని తిరుగు పయనమవుతారు.
News December 12, 2025
MHBD జిల్లాలో కాంగ్రెస్‌కే 80 సర్పంచ్ స్థానాలు

మహబూబాబాద్ జిల్లాలో మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో రాత్రి 10 వరకు సర్పంచ్ ఫలితాలు వెలువడ్డాయి. మహబూబాబాద్ జిల్లాలో మొత్తం 155 గ్రామ పంచాయతీలకు గాను 9 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. 146 గ్రామాలకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్-80, బీఆర్ఎస్-47, బీజేపీ-5, స్వతంత్ర అభ్యర్థులు-14 మంది సర్పంచ్‌లుగా గెలుపొందారు.
News December 12, 2025
4 కోట్ల మంది ప్రజలను గెలిపించాలన్నదే నా తపన: CM రేవంత్

TG: ఫుట్‌బాల్ తనకు ఇష్టమైన ఆట అని CM రేవంత్ తెలిపారు. ‘టీం స్పిరిట్‌ను ప్రదర్శించాల్సిన క్రీడ ఇది. TG టీంకు లీడర్‌గా 4కోట్ల మంది ప్రజలను గెలిపించాలన్నదే నా తపన. సంగారెడ్డి(D) సదాశివపేట్ కంకోల్‌లోని వోక్సెన్ వర్సిటీ సందర్శన వేళ విద్యార్థులతో కాసేపు ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేశా’ అని ట్వీట్ చేసి ఫొటోలను షేర్ చేశారు. రేపు ఉప్పల్‌లో మెస్సీ టీంతో రేవంత్ జట్టు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్న విషయం తెలిసిందే.


