News November 19, 2025

పటాన్‌చెరు: 290 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

image

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పటాన్‌చెరు పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం ఇస్నాపూర్ X రోడ్ వద్ద వాహన తనిఖీల్లో సివిల్ సప్లై డిప్యూటీ తహశీల్దార్ అనూప్ దేవానంద్‌తో కలిసి లారీని తనిఖీ చేశారు. లారీలో ప్రభుత్వ రేషన్ బియ్యం ఉన్నట్లు తేలింది. 290 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. లారీ యజమాని జయవీర్, డ్రైవర్ నారాబాయిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News January 16, 2026

52 ఏళ్ల వయసులోనూ సిక్స్ ప్యాక్.. సీక్రెట్ చెప్పిన సోనూ సూద్

image

52 ఏళ్ల వయసులోనూ సిక్స్ ప్యాక్‌తో ఆశ్చర్యపరుస్తున్నారు నటుడు సోనూ సూద్. తన ఫిట్‌నెస్‌ సీక్రెట్ ఏంటో ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. లేవగానే గోరువెచ్చని నీరు తాగుతానని, అనంతరం రోజూ గంటపాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్, కార్డియో, ఇతర వర్కౌట్స్‌తో పాటు ధ్యానం చేస్తానని తెలిపారు. పెద్దగా డైట్ ఫాలో అవ్వనని, హోమ్ ఫుడ్‌ని లిమిటెడ్‌గా తీసుకుంటానని వెల్లడించారు. ఇక షూటింగ్‌లలో ఫ్రూట్స్, నట్స్ తీసుకుంటానని అన్నారు.

News January 16, 2026

ఖమ్మం: పులిగుండాల చెంత.. పక్షుల కిలకిలరావాలు!

image

ప్రకృతి ఒడిలో పక్షుల విన్యాసాలను తిలకించేందుకు ‘బర్డింగ్ భారత్’ ఖమ్మం చాప్టర్ అద్భుత అవకాశం కల్పిస్తోంది. జనవరి 18న పులిగుండాల ప్రాజెక్ట్ వద్ద ‘బర్డ్ వాక్’ నిర్వహించనున్నారు. ఉదయం 7:30 నుంచి 9:30 వరకు సాగే ఈ నడకలో పక్షుల జీవవైవిధ్యంపై అవగాహన కల్పిస్తారు. ఆసక్తి గల వారు రూ. 250 ఫీజు చెల్లించి ఈ వినూత్న కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ప్రకృతి ప్రేమికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News January 16, 2026

ఢిల్లీలో కలవరపెడుతున్న శ్వాసకోశ మరణాలు

image

ఢిల్లీలో శ్వాసకోశ వ్యాధుల కారణంగా 2024లో 9,211 మంది మృతి చెందినట్లు ఢిల్లీ ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. ఇది 2023తో పోలిస్తే 410 ఎక్కువ మరణాలుగా అధికారులు తెలిపారు. ఆస్తమా, న్యుమోనియా, టీబీ, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వ్యాధులు ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. జననాల సంఖ్య తగ్గడం, మరణాల రేటు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కాలుష్యం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందనే విమర్శలు వస్తున్నాయి.