News November 19, 2025
పటాన్‌చెరు: 290 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పటాన్‌చెరు పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం ఇస్నాపూర్ X రోడ్ వద్ద వాహన తనిఖీల్లో సివిల్ సప్లై డిప్యూటీ తహశీల్దార్ అనూప్ దేవానంద్‌తో కలిసి లారీని తనిఖీ చేశారు. లారీలో ప్రభుత్వ రేషన్ బియ్యం ఉన్నట్లు తేలింది. 290 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. లారీ యజమాని జయవీర్, డ్రైవర్ నారాబాయిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News January 22, 2026
రేపు భక్తులకు అమ్మవారి జోగులాంబ నిజరూప దర్శనం

వసంత పంచమి పురస్కరించుకొని రేపు అలంపూర్ పట్టణంలోని ఐదో శక్తిపీఠమైన శ్రీ జోగులాంబ అమ్మవారి నిజరూప దర్శనం భక్తులకు కల్పించనున్నారు. అలంపూర్ పట్టణంలో మహిళలు రేపు పెద్ద సంఖ్యలో పంచామృత కలశాలతో పట్టణంలో ఊరేగింపుగా వచ్చి శ్రీ జోగులాంబ అమ్మవారికి కలశాభిషేకం చేసి దర్శించుకొనున్నారు. ప్రతి సంవత్సరం వసంత పంచమిన జరిగే ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు.
News January 22, 2026
40వేల మందితో సమగ్ర భూసర్వే చేయించాం: జగన్

AP: 40వేల మంది సిబ్బందితో భూముల రీసర్వే సమగ్రంగా చేయించామని YS జగన్ పేర్కొన్నారు. ‘సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకున్నాం. హెలికాప్టర్లు, డ్రోన్లు వినియోగించాం. ఈస్థాయిలో రైతులకు, ప్రజలకు మేలు చేసిన GOVT ఏదీలేదు. ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా డిజిటల్ రికార్డులు సిద్ధం చేశాం’ అని వివరించారు. ఏదో రాయిని పెట్టేసి వదిలేయకుండా అధికారిక సరిహద్దులు చూపేలా సమగ్ర చర్యలు తీసుకున్నామన్నారు.
News January 22, 2026
భద్రాద్రి జిల్లాలో 37 ఇంటర్ పరీక్ష కేంద్రాలు

కొత్తగూడెం జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు 37 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో 9,278 మంది, ద్వితీయ సంవత్సరంలో 9,407 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని పేర్కొన్నారు. పరీక్షల పర్యవేక్షణకు 550 మంది ఇన్విజిలేటర్లు, 37 మంది చీఫ్ సూపరింటెండెంట్లతో పాటు ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్‌లను నియమించినట్లు వెల్లడించారు.


