News November 19, 2025

పటాన్‌చెరు: 290 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

image

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పటాన్‌చెరు పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం ఇస్నాపూర్ X రోడ్ వద్ద వాహన తనిఖీల్లో సివిల్ సప్లై డిప్యూటీ తహశీల్దార్ అనూప్ దేవానంద్‌తో కలిసి లారీని తనిఖీ చేశారు. లారీలో ప్రభుత్వ రేషన్ బియ్యం ఉన్నట్లు తేలింది. 290 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. లారీ యజమాని జయవీర్, డ్రైవర్ నారాబాయిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News January 23, 2026

తడి, పొడి చెత్త సేకరణ పక్కాగా జరగాలి: కలెక్టర్

image

ఎన్‌జీటీ ఆదేశాలతో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి శుక్రవారం ఏలూరులో అధికారులతో సమీక్షించారు. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ బాధ్యతగా స్వీకరించి, భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

News January 23, 2026

మంచిర్యాల: ‘నిబంధనలకు లోబడి విధులు నిర్వహించాలి’

image

2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికారులకు అందిస్తోన్న శిక్షణను సద్వినియోగం చేసుకొని శిక్షణలో నేర్చుకున్న అంశాలను కచ్చితంగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. అధికారులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమైందన్నారు. పారదర్శకంగా, నిబంధనలకు లోబడి విధులు నిర్వహించాలన్నారు.

News January 23, 2026

అల్లూరి జిల్లా రహదారులు, భవనాల శాఖ EE మృతి

image

అల్లూరి సీతారామరాజు జిల్లా రహదారులు, భవనాల శాఖ EE బాల సుందరం బాబు శుక్రవారం ఆకస్మికంగా మృతి చెందారు. కొన్ని రోజులుగా అస్వస్థకు గురైన ఆయన విశాఖపట్నంలోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మరణవార్త తెలిసిన కలెక్టర్ దినేష్ కుమార్, జిల్లా యంత్రాంగం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.