News November 19, 2025
పటాన్‌చెరు: 290 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పటాన్‌చెరు పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం ఇస్నాపూర్ X రోడ్ వద్ద వాహన తనిఖీల్లో సివిల్ సప్లై డిప్యూటీ తహశీల్దార్ అనూప్ దేవానంద్‌తో కలిసి లారీని తనిఖీ చేశారు. లారీలో ప్రభుత్వ రేషన్ బియ్యం ఉన్నట్లు తేలింది. 290 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. లారీ యజమాని జయవీర్, డ్రైవర్ నారాబాయిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News January 20, 2026
సిరిసిల్ల: ‘సీఎంఆర్ లక్ష్యం గడువులోగా పూర్తి చేయాలి’

సీఎంఆర్ లక్ష్యం గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. ఖరీఫ్ సీజన్ 2024-25కు సంబంధించి సీఎంఆర్ డెలివరీకి చివరి తేదీ 16-02-2026, రబీ సీజన్ 2024–25కు సంబంధించిన డెలివరీకి చివరి తేదీ 28-02-2026గా నిర్ణయించినట్లు తెలిపారు. సీఎంఆర్ లక్ష్యంపై జిల్లాలోని రైస్ మిల్లర్లతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో అదనపు కలెక్టర్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
News January 20, 2026
తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్‌కు పురస్కారం

జాతీయ ఓటర్ల దినోత్సవం–2026 సందర్భంగా ఎన్నికల ప్రక్రియలో విశిష్ఠ సేవలు అందించినందుకు జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్న కలెక్టర్ వెంకటేశ్వర్‌కు అవార్డు లభించింది. ఓటర్ల నమోదు, అవగాహన కార్యక్రమాల నిర్వహణతో పాటు పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించినందుకు ఈ గుర్తింపు దక్కినట్లు అధికారులు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి జిల్లా ఎన్నికల యంత్రాంగం చేసిన కృషికి ఇది నిదర్శనంగా పేర్కొన్నారు.
News January 20, 2026
కాకినాడ కలెక్టర్‌కి అవార్డు

కాకినాడ జిల్లా కలెక్టర్ సగిలి షాన్ మోహన్‌ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ‘ఉత్తమ అధికారి’ అవార్డుకు ఎంపిక చేసింది. 2003, 2005 ఎన్నికల జాబితాలను సరిపోల్చే ప్రక్రియలో ఆయన అసాధారణమైన టేబుల్ వర్క్ పూర్తి చేసినందుకు ఈ గౌరవం దక్కింది. రాష్ట్రవ్యాప్తంగా అధికారుల పనితీరును పరిశీలించిన సీఈవో, ఆయనను విజేతగా ప్రకటించారు. ప్రస్తుతం ముస్సోరీలో ఉన్న కలెక్టర్‌కు జిల్లా అధికారులు, సిబ్బంది అభినందనలు తెలియజేశారు.


