News November 19, 2025
పటాన్‌చెరు: 290 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పటాన్‌చెరు పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం ఇస్నాపూర్ X రోడ్ వద్ద వాహన తనిఖీల్లో సివిల్ సప్లై డిప్యూటీ తహశీల్దార్ అనూప్ దేవానంద్‌తో కలిసి లారీని తనిఖీ చేశారు. లారీలో ప్రభుత్వ రేషన్ బియ్యం ఉన్నట్లు తేలింది. 290 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. లారీ యజమాని జయవీర్, డ్రైవర్ నారాబాయిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News January 19, 2026
PPP విధానంలో ఆర్టీసీ బస్టాండ్ల అభివృద్ధి

AP: రాష్ట్రంలోని ప్రధాన RTC బస్టాండ్లను PPP విధానంలో ₹958 కోట్లతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆటోనగర్ (విజయవాడ), గుంటూరు, కర్నూలు, మద్దిలపాలెం (విశాఖ), చిత్తూరు బస్టాండ్ల విస్తరణ, ఆధునికీకరణ చేయనున్నారు. తిరుపతి బస్టాండ్ అభివృద్ధి పనులు కేంద్ర సహకారంతో ఇప్పటికే ప్రారంభం అయ్యాయని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. కాగా ప్రైవేటు సంస్థలు ముందుకు రాగానే ఇతర బస్టాండ్ల పనులూ చేపడతారు.
News January 19, 2026
మేడారం అభివృద్ధిపై డిప్యూటీ సీఎం భట్టి ట్వీట్

మన సంస్కృతి, సంప్రదాయాలు, విశ్వాసాలను కాపాడుతూ, మన చారిత్రక వైభవం, ఘనమైన చరిత్రను భవిష్యత్ తరాలకు అందించడమే ప్రభుత్వ ఆలోచన అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ట్వీట్ చేశారు. సమ్మక్క-సారలమ్మల వీర చరిత్ర మరో వెయ్యేళ్ల పాటు చిరస్థాయిగా నిలిచేలా చేపట్టిన అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో కలిసి పరిశీలించినట్లు ఆయన పేర్కొన్నారు.
News January 19, 2026
చిన్న గ్రామం.. 100 మంది డాక్టర్లు

ఒక చిన్న గ్రామం దేశానికి 100 మంది డాక్టర్లను అందించింది. బిహార్ పాట్నాకు 55KMల దూరంలోని అమ్హారా గ్రామం ‘విలేజ్ ఆఫ్ డాక్టర్స్’గా పేరుపొందింది. సమాజ సేవ కోసమే ఇక్కడ చాలామంది డాక్టర్ చదువుతున్నారు. ఈ గ్రామానికి చెందిన సీనియర్ డాక్టర్లు రెగ్యులర్‌గా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తారు. విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇస్తారు. వారిని ఆదర్శంగా తీసుకుని గ్రామంలో మరింతమంది మెడిసిన్ చదవడానికి ఆసక్తి చూపుతున్నారు.


