News February 20, 2025
పటిష్ఠ చర్యలు చేపట్టండి: నగర మేయర్

వేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. ధర్మసాగర్ రిజర్వాయర్, ఫిల్టర్ బెడ్లను మేయర్ సందర్శించి నీటి నిల్వల తీరు, ఫిల్టర్ బెడ్ పరికరాలను పరిశీలించారు. నగర వాసులకు తాగు నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు ఉన్నారు.
Similar News
News March 15, 2025
గిర్నిబావి వద్ద కాల్పులు జరగలేదు: వరంగల్ సీపీ

కొమ్మాల జాతర సందర్భంగా గిర్నిబావిలో ప్రభ బండ్లు వరుస క్రమంలో తరలి వెళ్లే క్రమంలో కొంతమంది వ్యక్తులు అత్యుత్సాహం ప్రదర్శించారని పోలీసులు తెలిపారు. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసుల ఆదేశాలను పాటించకుండా సదరు వ్యక్తులు ముందుకు వెళ్లారన్నారు. ఈ క్రమంలో పోలీసులకు, ప్రభ బండ్లను తరలించే వారి మధ్య తోపులాట మాత్రమే జరిగిందని, ఎలాంటి పోలీస్ కాల్పులు జరగలేదని వరంగల్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్ తెలిపారు.
News March 15, 2025
వరంగల్: బ్యాంక్ సిబ్బంది వేధింపులు.. సోదరుల ఆత్మహత్యాయత్నం

వరంగల్ పట్టణ పరిధిలో దారుణం జరిగింది. ప్రైవేట్ బ్యాంక్ సిబ్బంది వేధింపులు తట్టుకోలేక పట్టణంలోని చిలుకూరి క్లాత్ స్టోర్ సోదరులు ఇద్దరు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో 108 ద్వారా ఎంజీఎం ఆస్పత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 15, 2025
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న సినీ హీరో శ్రీకాంత్

వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని శనివారం ప్రముఖ సినీ హీరో శ్రీకాంత్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శేషు తదితరులున్నారు.