News March 6, 2025
పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయింది: కవిత

కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని BRS ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు బీసీయేతర అభ్యర్థులను బరిలోకి దింపాయని, పార్టీలపరంగా, సిద్ధాంతపరంగా ఓట్లు చీలాయన్నారు. కాబట్టి పోటీలో ఉన్న బీసీ అభ్యర్థి హరికృష్ణ గెలవలేదని ఆమె అన్నారు. బీసీ రిజర్వేషన్లు ఉంటే ఆ స్థానంలో కచ్చితంగా అన్ని పార్టీలు బీసీకే టికెట్ ఇచ్చేవని వ్యాఖ్యానించారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఉండాలన్నారు.
Similar News
News December 14, 2025
భువనగిరి జిల్లాలో 82.53 శాతం పోలింగ్

భువనగిరి, పోచంపల్లి,వలిగొండ, రామన్నపేట, బీబీనగర్ రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో మొత్తం 82.53 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు.
News December 14, 2025
రిటైరయ్యే ఉద్యోగులకు శుభవార్త

AP: గ్రాట్యుటీ, పెన్షన్ ఇతర బెనిఫిట్స్‌కు దరఖాస్తు ప్రక్రియ గజిబిజిగా ఉండి రిటైర్డ్ ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీన్ని పూర్తిగా డిజిటలైజ్ చేస్తూ ‘రిటైర్మెంటు బెనిఫిట్స్ ప్రాసెసింగ్ సిస్టమ్’ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల అనవసర ప్రక్రియలు తొలగనున్నాయి. ఐటీ సిస్టమ్స్ ద్వారా CFMS, పేరోల్ వ్యవస్థలు ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (PAG)కి నేరుగా అనుసంధానమై ఉద్యోగులకు మేలు జరగనుంది.
News December 14, 2025
సంక్రాంతికి ఉత్తరాంధ్రకు ప్రత్యేక రైళ్లు ఏవీ?

ఉత్తరాంధ్ర నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలకు ఉపాధి కోసం అధిక సంఖ్యలో వలస వెళ్తుంటారు. వీరంతా సంక్రాంతికి తమ సొంతూరికి వెళ్లేందుకు సిద్ధం కాగా.. ఇప్పటికే అన్ని రైళ్ల టికెట్లు పూర్తిగా బుక్ అయ్యాయి. హైదరాబాద్ నుంచి ఉత్తరాంధ్రకు ఒక్క ప్రత్యేక రైలు కూడా ప్రకటించలేదు. పండగ రద్దీని దృష్టిలో పెట్టుకొని స్థానిక ప్రజా ప్రతినిధులు రైల్వే శాఖపై ఒత్తిడి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు.


