News February 18, 2025

పట్టిసీమ క్షేత్రానికి బ్రిడ్జి నిర్మించాలని కలెక్టర్‌కు వినతి

image

శివరాత్రి ఉత్సవాల్లో భక్తులు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. సోమవారం <<15490024>>పట్టిసీమ క్షేత్రాన్ని సందర్శించిన<<>> ఆమె ఉత్సవాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన రామారావు అనే వృద్ధుడు శివక్షేత్రానికి రాకపోకలు సాగించేందుకు వంతెన నిర్మించాలని నిలదీశారు. అది ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ బదులిచ్చారు.

Similar News

News March 13, 2026

టెన్త్‌ పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రత: ఎస్పీ

image

జిల్లాలో ఈ నెల 14 నుంచి వచ్చే నెల 16 వరకు జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. పరీక్షలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన నిఘా ఉంచామన్నారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 163 బీఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 13, 2026

గ్యాస్ కొరత అవాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

image

ఎల్‌పీజీ గ్యాస్ కొరత ఉన్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. బాట్లింగ్ ప్లాంట్లలో గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయన్నారు. గ్యాస్ సరఫరాను పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పాల్గొన్నారు.

News March 13, 2026

కొల్లాపూర్: ‘సాయి కృప’ ఆసుపత్రి సీజ్.. డాక్టర్లు, నర్స్ అరెస్ట్

image

కొల్లాపూర్‌లోని సాయి కృప ఆసుపత్రిలో మైనర్ బాలికకు అక్రమంగా అబార్షన్ చేసిన ఘటన కలకలం రేపింది. ఈ కేసులో ఇద్దరు డాక్టర్లు, ఒక నర్స్, నిందితుడైన మైనర్ విద్యార్థిపై పోలీసులు పోక్సో కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ముగ్గురు బాలికలను వంచించి అశ్లీల వీడియోలు చిత్రీకరించిన మైనర్ ఆగడాలు విచారణలో వెలుగులోకి వచ్చాయి.