News October 8, 2025
పడిపోయిన అరటి ధరలు.. నష్టాల్లో రైతులు

అరటి ధరలు భారీగా పడిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో SRపురం, పలమనేరు, వీకోట, బైరెడ్డిపల్లి మండలాల్లో రైతులు విరివిగా అరటి పంటను సాగు చేశారు. ధరలు లేకపోవడంతో పలువురు రైతులు పంటను తోటలోని వదిలేస్తున్నారు. రూ.లక్షల్లో పంట నష్టం వాటిల్లుతోందని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల కోరుతున్నారు.
Similar News
News January 24, 2026
రూ.1,417 కోట్ల చెక్ అందజేసిన CM

మహిళల ఆర్థిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. నగరిలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో 12,932 మహిళా సంఘాలకు రూ.1,417 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాల మెగా చెక్‌ను సభ్యులకు శనివారం ఆయన అందజేశారు. కార్యక్రమంలో ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్, పలువురు అధికారులు పాల్గొన్నారు.
News January 24, 2026
రొంపిచర్ల: ప్రేమికుడిని పెళ్లి చేసుకున్న మిస్సింగ్ యువతి

రొంపిచర్ల R బెస్తపల్లిలో మూడో రోజుల క్రితం మిస్సయిన తేజశ్రీ(20) అనే యువతి తను ప్రేమించిన యువకుడు యోగేంద్ర రెడ్డి (24)ని పెళ్లి చేసుకుందని రొంపిచర్ల ఎస్సై మధుసూదన్ తెలిపారు. వీరు భాకరాపేట సమీపంలోని దేవరకొండ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఇద్దరు నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారని చెప్పారు. మేజర్లు కావడంతో ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు.
News January 24, 2026
చిత్తూరు: వేతనం చెల్లించకపోతే కాల్ చేయండి

ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వం ప్రస్తుతం వీబీజీ- రామ్ జీగా మార్చిన సంగతి తెలిసిందే. కూలీలకు వేతనం చెల్లించకపోయినా, పని ప్రదేశంలో వసతులు లేక పోయినా, జాబ్ కార్డుల సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబరును అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు. 1800 2001 001 టోల్ ఫ్రీ నంబర్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. సమస్యలపై ఆ నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చన్నారు.


