News November 5, 2025

పత్తికి సీసీఐ చెల్లించనున్న మద్దతు ధరలివే..!

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఐదు కేంద్రాలలో పత్తిని కొనుగోలు చేయనున్న సీసీఐ 8 శాతంలోపు తేమ ఉన్న క్వింటాలు పత్తికి రూ.8,110/-, 10 శాతం వరకు తేమ ఉంటే రూ.7,947/-, 11 శాతం వరకు తేమ ఉంటే రూ.7,866/-, 12 శాతం తేమ ఉంటే రూ.7,785/-ల మద్దతు ధరను పొందవచ్చు. అయితే పత్తి విక్రయించాల్సిన రైతులు ముందుగా కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. SHARE IT.

Similar News

News January 21, 2026

మంచిర్యాలలో సర్పంచ్‌లకు శిక్షణ

image

ప్రతి ఒక్కరు తమ గ్రామాలను 100% అక్షరాస్యత సాధించేలా కృషి చేయాలని జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం అన్నారు. మంచిర్యాల జిల్లాలో జరుగుతున్న సర్పంచ్‌ల శిక్షణ కార్యక్రమంలో హాజరై ఉల్లాస్- అమ్మకు అక్షరమాల కార్యక్రమంపై సర్పంచులకు అవగాహన కల్పించారు. గ్రామాల్లో నిరక్షరాస్యులైన వయోజనులు ప్రతి ఒక్కరు చదువు నేర్చుకునేలా ప్రోత్సహించాలన్నారు. అమ్మకు అక్షరమాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

News January 21, 2026

గుండెపోటుతో నటుడు మృతి

image

మలయాళ నటి ఊర్వశి సోదరుడు, నటుడు కమల్ రాయ్(54) కన్నుమూశారు. చెన్నైలో ఆయన గుండెపోటుతో మరణించారు. తమిళ్ సినిమా ‘పుతుస పడికిరెన్ పాటు’ సినిమాతో హీరోగా పరిచయమైన కమల్ 30 చిత్రాల్లో నటించారు. ఇందులో సాయుజ్యం, మంజు, కింగిని, వచలమ్, శోభనం, ది కింగ్ మేకర్, లీడర్ తదితర సినిమాలున్నాయి. ఆయన సోదరి ఊర్వశి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. ఆమె తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో మొత్తం 350 చిత్రాల్లో నటించారు.

News January 21, 2026

మాతృ మరణాల నివారణకు పకడ్బందీ చర్యలు: DMHO

image

విశాఖపట్నం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.పి.జగదీశ్వర రావు ఆధ్వర్యంలో మాతృ మరణాలపై సమావేశం జరిగింది. మూడు నెలల్లో నమోదైన మాతృ మరణాలపై ఆయన చర్చించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. హైరిస్క్ గర్భిణీలను ముందుగానే గుర్తించి, మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్, వీజీహెచ్‌కు పంపాలని, సురక్షిత ప్రసవాలు జరిగేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.