News October 8, 2025
పత్తి కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్

పత్తి పంటను కనీస మద్దతు ధర (MSP)కు కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ ఆదేశించారు. బుధవారం జిల్లా అధికారులతో పత్తి కొనుగోలు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 98,260 ఎకరాలలో పత్తి సాగు జరిగిందని, దీని ద్వారా సుమారు 11,79,000 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అక్టోబర్ తర్వాత పత్తి దిగుబడి ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు.
Similar News
News January 20, 2026
షుగర్ పేషంట్లకు ‘తీపి’ వార్త!

తీపి అంటే ఇష్టం ఉన్నా ఆరోగ్య సమస్యల వల్ల దూరంగా ఉండేవారికి శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ చెప్పారు. సూక్రోస్‌లోని 92% తియ్యదనం, అందులో 1/3 వంతే క్యాలరీలు ఉన్న ‘తగటోస్’(Tagatose) అనే కొత్త రకం షుగర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇది శరీరంలో ఇన్సులిన్ స్థాయులను పెంచదు. దీనివల్ల బరువు పెరుగుతామన్న భయం లేకుండా డయాబెటిస్ ఉన్నవారూ మధుర రుచిని ఆస్వాదించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
News January 20, 2026
NIT వరంగల్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News January 20, 2026
గుంటూరు మిర్చి యార్డులో నేటి ధరల వివరాలు

గుంటూరు మిర్చి యార్డుకు మంగళవారం 30 వేల ఏసీ బస్తాలు, 35 వేల కొత్త బస్తాలు అమ్మకానికి వచ్చాయి. మార్కెట్‌లో ధరలు ఈ విధంగా నమోదయ్యాయి. ప్రధాన రకాల ధరలు (కేజీకి): ఎల్లో రకం: రూ.350 – 450, (అత్యధికం) 2043: రూ.200 – 290 తేజా: రూ.140 – 185, 355 రకం: రూ.160 – 210, బుల్లెట్: రూ.160 – 200, నాటు రకాలు: రూ.150 – 210, సీడు తాలు: రూ.90 – 140 వరకు ధర పలికాయి.


