News March 19, 2025
పదవ తరగతి పరీక్షకు 124 మంది గైర్హాజరు: డీఈవో

అనకాపల్లి జిల్లాలో బుధవారం జరిగిన పదవ తరగతి పరీక్షకు 124 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు 20,774 మంది హాజరు కావాల్సి ఉండగా 20,670 మంది హాజరైనట్లు తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులు 46 మంది హాజరుకావాల్సి ఉండగా 20 మంది హాజరైనట్లు తెలిపారు.
Similar News
News April 21, 2025
చట్ట పరిధిలో సమస్యలు పరిష్కరించాలి: ఎస్పీ

బాధితుల సమస్యలను తక్షణమే చట్ట పరిధిలో పరిష్కరించాలని ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. సోమవారం ఆయన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి, 7 రోజుల్లో న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులకు ఆయన ఆదేశించారు. భూతగాదాలకు సంబంధించి 17, కుటుంబ కలహాలు 2, మోసాలకు పాల్పడినవి 4, ఇతర అంశాలకు సంబంధించి 2 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు.
News April 21, 2025
అనకాపల్లి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 320 అర్జీలు: జేసీ

అనకాపల్లి కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు వివిధ సమస్యలపై అధికారులకు 320 అర్జీలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ జాహ్నవి మాట్లాడుతూ.. సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని పరిశీలించి సంబంధిత అధికారులకు పంపించారు.
News April 21, 2025
NZB: రైతు మహోత్సవం అట్టహాసంగా ప్రారంభం

నిజామాబాద్‌లోని గిరిరాజ్ కళాశాల మైదానంలో రైతు మహోత్సవాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సలహాదారు షబ్బీర్ అలీ, పోచారం పాల్గొన్నారు. ఐదు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యారు. వ్యవసాయ, పశుపోషణ, సేంద్రీయ పద్ధతులపై 150 స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.