News February 12, 2025
పదిలో మెరుగైన ఫలితాలు సాదించాలి:DTDO

10వ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చాలని DTDO రమాదేవి అన్నారు. స్వయం ప్రణాళిక, పాఠ్యాంశ పునశ్చరణతో పాటుగా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాస్తే ఉత్తమ ఫలితాలు సాధిస్తారని పేర్కొన్నారు. మంగళవారం కెరమెరి మండలంలోని హాట్టి ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసి, పలు రికార్డులను పరిశీలించి ఆమె మాట్లాడారు. విద్యార్థులు ఎంత వెనకబడి ఉన్నా మెరుగైన శిక్షణ ఇస్తే ఉత్తమ ఫలితాలు సాధించగలగుతారన్నారు.
Similar News
News March 21, 2025
శివంపేట: హత్యాయత్నం కేసులో ముగ్గురు అరెస్ట్

బోరు విషయంలో ఒక కుటుంబంపై దాడి చేసిన ఘటనలో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్టు శివంపేట ఎస్ఐ మధుకర్ రెడ్డి తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాలు.. తిమ్మాపూర్ గ్రామంలో గత రాత్రి బాలయ్య కుమారులు ప్రసాద్, రాజు అనే వ్యక్తులు దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు.
News March 21, 2025
దంపతుల హత్య కేసులో పలువురికి శిక్ష:SP

దంపతుల దారుణ హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు విధించినట్లు వికారాబాద్ SP నారాయణరెడ్డి తెలిపారు. ధారూర్ PS పరిధిలోని నాగసముందర్ కు చెందిన చిన్న నర్సింహులు, అంజమ్మలను అదే గ్రామానికి చెందిన బంధప్పతో పాటుగా ఆరుగురుతో కలిసి దాడి చేసి చంపారు. ఈ కేసులో పలువురికి జడ్జి సున్నం శ్రీనివాస్ రెడ్డి శిక్ష విధించినట్లు ఎస్పీ తెలిపారు.
News March 21, 2025
శ్రీకాకుళం: పావురం ఈకపై.. సునీత విలియమ్స్ చిత్రం

అంతరిక్ష కేంద్రం నుంచి సురక్షితంగా వచ్చిన భారతీయ సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ గౌరవార్థం పావురం ఈకపై ఆమె చిత్రాన్ని గురువారం నగరానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు వాడాడ రాహుల్ పట్నాయక్ రూపొందించారు. రాహుల్ గతంలో కూడా పక్షుల వెంట్రుకలపై శ్రీనివాస కళ్యాణం, శ్రీరామ పట్టాభిషేకం, కృష్ణుడు, ఆదిత్యుడు మరెన్నో చిత్రాలు గీశారు. ఆయనకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఎన్నో పురస్కారాలు పొందారు.