News April 2, 2024

పది’ మూల్యాంకనం ప్రారంభం: డీఈఓ

image

పదో తరగతి పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే. పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం సోమవారం నుంచి ప్రారంభమైనట్లు కర్నూలు జిల్లా విద్యాశాఖాధికారి శ్యాముల్ తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 180 లక్షల జవాబు పత్రాలు వచ్చాయన్నారు. ఆరోగ్య సమస్యలున్న ఉపాధ్యాయులకు మూల్యాంకన ప్రక్రియ నుంచి మినహాయింపు ఇచ్చామన్నారు.

Similar News

News February 16, 2026

కర్నూలు జిల్లాలో యూరియా కొరత లేదు

image

కర్నూలు జిల్లాలో రబీ సీజన్‌కు అవసరమైన యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి తెలిపారు. ఇప్పటివరకు 18,168 మెట్రిక్ టన్నుల యూరియా విక్రయాలు జరిగాయని, ప్రస్తుతం 5,897 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని చెప్పారు. ఎరువుల కొనుగోలు సమయంలో ఎంఆర్పీ ప్రకారం చెల్లించి, రశీదు తీసుకోవాలని రైతులకు సూచించారు.

News February 16, 2026

సీఎం, బిల్‌గేట్స్‌ వీసీలో పాల్గొన్న కర్నూలు కలెక్టర్

image

సీఎం చంద్రబాబు నాయుడు మైక్సోసాప్ట్ ఫౌండర్ బిల్‌గేట్స్‌తో కలిసి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు, ఆర్టీజీఎస్ టెక్నాలజీ, వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత వినియోగంపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా బిల్‌గేట్స్‌కు రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. ఈ సమీక్షలో కలెక్టర్ డా.ఏ.సిరి, జేసీ నూరుల్ ఖమర్ వర్చువల్ విధానంలో పాల్గొన్నారు.

News February 16, 2026

ఫేక్ లింకులపై అప్రమత్తం కావాలి: కర్నూలు ఎస్పీ

image

కర్నూలులో ఫేక్ లింకుల ద్వారా సైబర్ మోసాలు పెరుగుతున్నాయని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. క్రికెట్ లైవ్ స్ట్రీమింగ్, బ్యాంక్ KYC, లోన్ ఆఫర్లు పేరుతో వచ్చే లింకులు క్లిక్ చేయవద్దని సూచించారు. OTPలను ఎవరితోనూ పంచుకోవద్దని తెలిపారు. మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని సూచించారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.